
(కర్నూలు ఆంధ్రన్యూస్)సాంఘిక సంక్షేమ మరియు బీసీ సంక్షేమ మరియు ట్రైబల్ సంక్షేమ వసతిగృహాలకి ప్రభుత్వం ప్రీ మెట్రిక్ విద్యార్థులకు మెనూ చార్జెస్ 1400 రూపాయలు, పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు 1600 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది.కానీ సంక్షేమ వసతి గృహాలకు రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ పర్చేస్ కమిటీ ద్వారా ఆహార పదార్థాలను సరఫరా చేస్తామని చెప్పియున్నారు.కానీ,ఇంతవరకు అమలు కాలేదు. అందులో భాగంగా 2023-2024 సంవత్సరంలో వేసిన టెండర్లను కర్నూలు జిల్లాలో 2024-2025 విద్యా సంవత్సరానికి కంటిన్యూ చేయడం జరిగినది. ప్రస్తుతం విద్యా సంవత్సరం మొదలైనప్పటికీ టెండర్లు,ఖరారు కాకపోవడం వల్ల పాత వారి తోనే సరి పెట్టుకోవలసి వస్తుంది.ఇలా పాత టెండర్లను అలాగే కొనసాగించడం వల్ల వారు సరఫరా చేసే ఆహార పదార్థాలు నాణ్యత లేకపోవడమే కాకుండా సరైన తూకం ఉండడం లేదని, వసతి గృహ సంక్షేమ అధికారులు బయటికి చెప్పుకోలేని పరిస్థితి. సాంఘిక సంక్షేమ కళాశాల వసతి గృహాలు కర్నూలు జిల్లాలో మొత్తం 8 ఉన్నాయి. వీటిలో గతంలో స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్స్ గా ఉండేవి. ప్రస్తుతం అవి డిపార్ట్మెంట్ అటాచ్డ్ హాస్టల్స్ వసతి గృహాలుగా కొనసాగుతున్నాయి.వీటిలో నాలుగవ తరగతి సిబ్బంది లేకపోవడం వల్ల వసతి గృహ సంక్షేమ అధికారులు వారికి రోజువారి కూలీలు చెల్లించాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.ప్రభుత్వమేమో 1600 రూపాయలకు మెనూ ఏర్పరిచి విద్యార్థులకు కచ్చితంగా అమలు పరచవలెనని ప్రభుత్వం నిర్ణయించింది.అయితే ఈ మెనూ ఉన్న ఆహార పదార్థాలను వండి పెట్టడానికి ఏమో నాలుగవ తరగతి సిబ్బందిని నియమించకపోవడం శోచనీయం.అయితే మరి ఆహార పదార్థాలను ఎవరు వండి పెట్టాలి? సాంఘిక సంక్షేమ కళాశాల వసతి గృహాలలో నాలుగో తరగతి సిబ్బందిని కర్నూలు జిల్లాలో నియమించబడలేదు.ఇది కేవలం రాష్ట్రంలో ఆరు జిల్లాలకు మాత్రమే ఇలా ఉందని తెలిసినది. మిగతా జిల్లాలలో ఆప్కోస్ ద్వారా 4వ తరగతి సిబ్బందిని నియమించడం జరిగినది.మరి సాంఘిక సంక్షేమ కళాశాల వసతి గృహములలో 100% మెనూ అమలు పరచాలంటే 4వ తరగతి సిబ్బందిని నియమించాలి లేకపోతే అప్పులు మోయలేని భారంగా మాకు తప్పవని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ తెలియజేస్తున్నారు.దీనిని పరిశీలించిన వెంటనే నాలుగవ తరగతి సిబ్బందిని నియమించాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుచున్నారు.



