కౌతాళం (ఆంధ్రన్యూస్)
కౌతాళం మండల పరిధిలో ఉప్పర హాల్ గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన ప్రియతమ హ్యాట్రిక్ శాసనసభ్యులు వై.బాలనాగి రెడ్డి మరియు యువ నా యకులు వై.ప్రదీప్ రెడ్డి ఉప్పరహాల్ గ్రామంలో ప్రతి ఇంటిని సందర్శించి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ఉప్పరహాల్ గ్రామంలో అవ్వా,తాతలకు, అక్కచెల్లేమ్మలకు వై.యస్.ఆర్ పింఛన్ అందించడం జరిగింది.ప్రజల సమస్యలను శాసనసభ్యులు వై.బాలనాగిరెడ్డి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతికి తావు లేకుండా పలు సంక్షేమ పథకాలతో పాటు ప్రజా ప్రయోజనాల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ విశ్వసనీయతకు మారుపేరుగా పాలన సాగిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికే చెందుతుందని,రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబంగా భావిస్తూ అందరి సంక్షేమం,అభ్యున్నతికై వైయస్ జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు.సచివాలయ వాలంటీర్ వ్యవస్థలను ప్రవేశపెట్టి ప్రభుత్వ పథకాలను ఇంటి ముంగిటకే అందిస్తున్నారని చెప్పారు , ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకునే విధంగా గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేస్తున్నట్లు ,ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు క్షేత్రస్థాయిలోఅందుతున్నాయా లేదా.ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటూ,ప్రజలు తమ దృష్టికి తెచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టేలా ముందుకుసాగుతున్నారు..ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ దేశాయ్ ప్రహ్లాద ఆచారి,అత్రి గౌడ్.జడ్పిటిసి,రాధమ్మ.బుజ్జి స్వామి.సిద్దేష్,కృష్ణంరాజు,ఎంపీపీ అమరేష్, కౌతాళం మేజర్ పంచాయతీ సర్పంచ్ పాల్ దినాకర్,తోవి నరసప్ప,వడ్డే రాముడు ఆయా గ్రామం ఎంపిటిసిలు,సర్పంచులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.
కౌతాళం మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823