కౌతాళం ఆంధ్రన్యూస్ డిసెంబర్ 03 కౌతాళం మండలం మంత్రాలయం తెదేపా పార్టీ సీనియర్ నాయకులు చూడి ఉలిగయ్య మాట్లాడుతూ అభివృద్ధి చేతగాక,ఉన్నత పదవిలో ఉండి,రాష్ట్రానికి,ఇటు జిల్లాకి అభివృద్ధి చెయ్యడం చేతకాక మా నాయకుడు,మచ్చలేని మాజీ మంత్రి వర్యులను విమర్శించడం తగదని,మీరు కర్నూల్ మేయర్ గా ఉంటు ఎంతవరకు అభివృద్ది చేశారో బహిరంగంగా చెప్తారా.మీ నాయకుడు బయటకు రాలేని దీనస్థితిలో ఉన్నారు, ప్రజలు ఎక్కడ తిరగబడి కొడుతారో అనే భయంతో పోలీస్ వ్యవస్థను, బార్కెడ్ లను అడ్డుపెట్టుకొని వచ్చే మీరు మా నాయకుడి గురించి మాట్లాడుతారా…? దాదాపు4 సంవత్సరాలు అవుతుంది రాష్ట్రాములో గిటికేడు మట్టి వెయ్యలేదు, పల్లెల్లో సీసీ రోడ్ లేదు, ఒకానొక ప్రాజెక్టు లేదు, ఉన్న కంపెనీలు పక్క రాష్ట్రాలకు పారిపోతున్న పట్టించుకోని మీరు, వైసీపీ నాయకులు భూకబ్జా, లాండ్ , ఇసుక , మట్కా మాఫియా చెయ్యడనికి మాత్రమే ఉన్నారు తప్ప రాష్ట్రా ప్రజలకు చేసిందేమీ లేదు అని, మూడు రాజధానిలని, ఎదేదో ప్రజలను మభ్య పెట్టి, మాయమాటలు చెప్పి పాలించాలని చూసే రోజులు పోయాయి ప్రజలు2024లో టిడిపి అధికారంలో వచ్చేది ఖాయమని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లాక్కే గోవిందు, కురువా నాగేష్, సిద్ధయ్య, దుర్గయ్య, మహంతేష్ ,మణి, యాంకన్న తదితరులు పాల్గొన్నారు…
కౌతాళం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర 6305950823