Wednesday, January 21, 2026
spot_imgspot_imgspot_imgspot_img
Homeఒంగోలుమహిళ వైద్యలు, సిబ్బందికి ఘన సన్మానం.

మహిళ వైద్యలు, సిబ్బందికి ఘన సన్మానం.

ఆంధ్రన్యూస్ : ఒంగోలు. సమాజంలోని లింగ వివక్షత పోవాలంటే మహిళా దినోత్సవం, మాతృ దినోత్సవం, సోదరీ వేడుకలు ప్రజల మధ్య, మన ఇంట ఉన్న మగపిల్లలచే జరిపించాలని, అప్పుడే మహిళలపట్ల భవిష్యత్ తరానికి ఉన్న తక్కువ, ఎక్కువ భావనలు తొలగిపోతాయని, జీవి పుట్టుక నుండి గిట్టేదాకా ప్రతి వారి జీవితంలో ప్రముఖ పాత్ర పోషించేది మహిళా మాత్రమేనని స్త్రీ మూర్తి లేని నాడు జీవన మనుగడ చక్రం పూర్తిగా స్తంభించిపోతుందని, వాసవి క్లబ్ సిటిజన్స్ సభ్యులు మహిళా దినోత్సవం సందర్భంగా మాకు గౌరవం ఇచ్చి సత్కరించడం, వారికి మహిళల పట్ల ఉన్న ఉన్నత భావాలను తెలుపుతుందని ప్రభుత్వ మాతా శిశు వైద్యశాల సూపర్నెంట్ డాక్టర్ సంపూర్ణ ధన్యవాదాలు తెలిపారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ అధ్యక్షులు చీదెళ్ల వేంకట ప్రసాద్ అధ్యక్షత వహించి నిర్వహించిన మహిళా దినోత్సవం వేడుకలకు మాతాశిశు వైద్యశాల వేదిక అయింది.

ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ పురుషుని కంటే స్త్రీ బలహీనురాలు కాదని, ఎన్ని సమస్యలు వచ్చినా మనోనిబ్బరంతో అందరినీ కలుపుకొని ముందుకు సాగే మహోన్నత శక్తి అని అభివర్ణించారు. కూతురిగా, సోదరిగా, భార్యగా, అమ్మగా ఎన్నో రూపాల్లో మహిళా మూర్తి మన జీవితాల్లో ప్రముఖ స్థానం వహిస్తున్నారని తెలిపారు. ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, సిస్టర్స్ గా, ఆయాలుగా, కలెక్టర్లుగా, పోలీస్ అధికారులుగా, ఉపాధ్యాయులుగా ఎన్నో రూపాల్లో మనం ఉన్నత స్థానం చేరటానికి మహిళ పడే కష్టం, బిడ్డకు జన్మనిచ్చే సమయంలో పడే బాధ ఏ ఒక్కరు గుర్తించడం లేదని, గుర్తుంచుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ఒక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే కాకుండా ప్రతిరోజు స్త్రీ మూర్తిని గౌరవించుకోవడం మన బాధ్యత అని తెలిపారు.

వాసవి క్లబ్ తరఫున ఈ మహిళా దినోత్సవం రోజున వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ వారు ఉన్నతమైన ఉదాత్తమైన మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించడం చాలా గొప్పదని వాసవి క్లబ్ అంతర్జాతీయ సేవా సంస్థ రూపొందించిన నియమావళి ప్రకారం నిర్వహించే కార్యక్రమాల పర్యవేక్షణ కార్యక్రమం ” జోన్ ఛైర్ పర్సన్ ఫ్రెండ్లీ విజిట్” కు విచ్చేసిన జోన్ చైర్మన్ చలువాది సత్యనారాయణ పేర్కొన్నారు. వాసవి క్లబ్స్ నిర్వహిస్తున్న కార్యక్రమం “అమ్మకు గౌరవం” పేరిట పసి పిల్లలకు పాలిచ్చే గది నిర్మాణం అత్యంత ప్రజాదరణ పొందిందని, మన ఒంగోలులో కూడా ఈ గది నిర్మాణం చేయడానికి సమాయత్తమవుతున్నామని తెలిపారు. “ప్రతి సందర్భానికి సేవను జత చేసి సమాజ సేవ చేసే వాసవి క్లబ్స్ సేవలు ఉన్నతమైనవవి” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మాతా శిశు వైద్యశాల వైద్యులు డాక్టర్ సంపూర్ణ, డాక్టర్ శ్వేత, డాక్టర్ రవళి, డాక్టర్ ఉషా బాల, డాక్టర్ సుష్మ, నర్సింగ్ సిబ్బంది సిస్టర్లు కమల కుమారి, సుమతి, మణికుమారి, అరుణ, సురేఖ, వెంకటరమణ, విజయలక్ష్మి, జోష్ణ రాణి మరియు ఆయాలు బాలనాగమ్మ, జాలమ్మ, లక్ష్మి రమణ, సంపూర్ణ, సుధా, గీత, అంజమ్మ, ప్రభావతి తదితరులకు సత్కారం చేశారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, పసివారికి బ్రెడ్స్, పండ్లు, జుబ్బాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు చీదెళ్ల వెంకటప్రసాద్ వెంకటలక్ష్మి రాజ్యం దంపతులు, భూమా శ్రీనివాసులు నీరజ దంపతులు, జోన్ చైర్మన్ చలువాది సత్యనారాయణ మరియు మద్దు అరవింద లక్ష్మి, నేరెళ్ల శ్రీనివాసరావు, తుమ్మపూడి ఏడుకొండలు, రాధా రమణ గుప్తా జంధ్యం, దుడ్డు సురేష్ తదితర క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments