ఆంధ్రన్యూస్ : ఏలేశ్వరం. ఏలేశ్వరం మండలం ఎర్రవరం,సిరిపురం గ్రామాల్లో బిజెపి ఆధ్వర్యం లో భారత జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి , మహాత్ముని విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. స్వాతంత్ర్య పోరాటం లో గాంధీజీ దేశానికి చేసిన సేవలు స్మరించుకుంటూ అహింసే తన ఆయుధంగా ,సత్యమే తన శక్తి గా , భగవద్గీత ను చేతబూని, అహింసో పరమో ధర్మః అని నినదించి, దేశం నుండి ఆంగ్లేయులను తరిమి కొట్టిన మహనీయుడు అని ,భరత మాత సంకెళ్లను తెంచిన మహాత్ముడు గాంధీజీ అని బీజేపీ జిల్లా కార్యదర్శి కొల్లా శ్రీనివాస్ తెలియ జేశారు. బాపూజీ జయంతి సందర్భంగా దేశ ప్రధాని శ్రీ మోడీ జీ పిలుపు మేరకు ఆప్కో చేనేత వస్త్రాల స్టాల్ ను ఈరోజు ఎర్రవరం గ్రామ పంచాయితీ వద్ద ఏర్పాటు చేసినట్లు మండల అధ్యక్షులు ఏనుగు ధర్మ రాజు అన్నారు.ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం పట్టణ అధ్యక్షుడు గట్టిం వెంకట రమణ, ప్రజా పోరు ప్రోగ్రాం ఇంచార్జి దాకే కృష్ణారావు , గ్రామ పంచాయితీ వార్డు సభ్యులు, బిజెపి జిల్లా కో ఆపరేటివ్ సెల్ కన్వీనర్ వెలుగూరి హరేరామ్,రెడ్డి లోవరాజు, ఓబీసీ మోర్ఛ జిల్లా కన్వీనర్ వానపల్లి చిన్న బాబు, కూరాకుల రాజా,కోట నూక రాజు, పతివాడ వెంకటేశ్వర రావు, బండారు సూరిబాబు, గుల్లంపూడి కొండలరావు, చిన్ని కృష్ణ, పలివెల చంద్రరావు , పొలమూరి పెదకాపు,వజ్రంగి సల్మాన్ రాజు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
మహాత్మునికి ఘనంగా జయంతి నివాళులు
RELATED ARTICLES