
ఆంధ్రన్యూస్ : జంగారెడ్డిగూడెం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం స్వయంభూ మద్ది ఆంజనేయస్వామివారి దివ్యసన్నిధికి సుదూర ప్రాంతాలనుండి వచ్చి దర్శించి తిరిగి వెళ్లే సమయంలో భక్తులు బస్సుల కోసం వేచిఉండేందుకు ఉన్న బస్ షెల్టర్ వద్ద భక్తులు ముక్యంగా వయోవృద్ధులు,మహిళలు,చిన్నారులు కూర్చునేందుకు వీలుగా రెండు సిమెంట్ సోఫాలను జంగారెడ్డిగూడెం శ్రీమద్ది ఆంజనేయ మ్యాక్స్ లిమిటెడ్ మంగళవారం ఉదయం నిర్వహించిన సేవాకార్యక్రమంలో భాగంగా అందజేశారు
ముందుగా మ్యాక్స్ మేనేజింగ్ డైరెక్టర్ దాకారపు నరసింహమూర్తి,డైరెక్టర్ బండారు సత్యనారాయణ, తదితరులు స్వామివారిని దర్శించి పూజలు నిర్వహించిన అనంతరం ఏలూరు వెళ్లే ప్రధాన రహదారి ప్రక్కన గల బస్ షెల్టర్ వద్ద కార్యక్రమం నిర్వహించి సిమెంట్ సోఫాలను ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు,ట్రస్టీ మల్నీడి బాబీలకు అందజేశారు.
దాకారపు నరసింహమూర్తి మాట్లాడుతూ మద్ది క్షేత్రం లో ఈ సేవను నిర్వహించుకోగలగడం సంతృప్తిని ఇచ్చిందని,కూర్చునే సదుపాయం భక్తులకు అందించాలనే సంకల్పంతో తమ సంస్థ ద్వారా సోఫాలు అందించామని తెలిపారు.
బండారు సత్యనారాయణ మాట్లాడుతూ మద్ది క్షేత్రం లో ఈ సేవను నిర్వహించుకునే అవకాశం కల్పించిన దేవస్థానం ప్రతినిధులకు మ్యాక్స్ లిమిటెడ్ తరుపున ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో అధ్యాత్మికవేత్త ధనకుమార్ మరియు యల్ మహంకాళి తదితరులు పాల్గొన్నారు.



