మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో అష్టోత్తర పూజలు

0
151

మెట్టజ్యోతి: జంగారెడ్డిగూడెం. మంగళవారం సందర్భముగా ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దర్శనార్ధము అధిక సంఖ్యలో భక్తులు, విచ్చేసి శ్రీస్వామి వారి ఆలయము చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కుబడులు తీర్చుకుని, శ్రీస్వామివారికి అత్యంత ప్రీతీకరమైన తమలపాకులు (నాగవల్లీ దళములు)తో అష్టోత్తరం పూజలను, అన్నప్రాసనలు, వాహనం పూజలను నిర్వహించుకొన్నారు. ఈ రోజు మద్యాహ్నం గం.02.00 ల.వరకు శ్రీసామివారి దేవస్థానమునకు వివిధ సేవల రూపేణ రూ. 1,16,697/- లు సమకూరినది.. సుమారు 800 మంది భక్తులకు స్వామి వారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ జరుపబడినది. ఈ రోజు ఆలయమువద్ద లింగగూడెంనకు చెందిన శ్రీకృష్ణ భజన మండలి వారిచే హనుమాన్ చాలీసా పారాయణం 108 సార్లు నిర్వహించబడినది. శ్రీస్వామివారి దర్శనముంకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా ఆలయ ధర్మకర్త మల్నీడి మోహనకృష్ణ (బాబీ), పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అద్యక్షురాలు శ్రీమతి సరిత విజయభాస్కర్ రెడ్డి మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెల్పినారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here