
మట్టి రోడ్డు నిర్మాణానికి రూ. 15 లక్షలతో శంకుస్థాపన.
ఆంధ్రన్యూస్, అరకు మండలం : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం అరకు వ్యాలీ మండలంలోని మారుముల లోతేరు పంచాయతీ, వంతలగూడా నుండి లిడంగి వరకు మట్టి రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.15 లక్షలు మంజూరు చేసినట్లు లోతేరు సర్పంచ్ గుబాయి కళావతి తెలిపారు. బుధవారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ మారుమూల గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలనీ స్థానిక శాసనసభ్యులు చెట్టి ఫల్గుణ కు విన్నవించగా స్పందించిన ఎమ్మెల్యే రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించి నిధులు మంజూరు చేశారన్నారు. మారుమూల గ్రామ ప్రజల సౌకర్యార్థం నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే గారికి ఈ ప్రాంత ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపమన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా రహదారి సౌకర్యానికి నోచుకోని ఈ ప్రాంత ప్రజలు నిర్మాణానికి ఎం జి ఎన్ ఆర్ ఏ జస్ పథకం కింద నిధులు మంజూరు చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఎంజీ ఎన్ఆర్ఈజీఎస్ ఈసీ, స్థానిక ఎంపిటిసి, వీఆర్పి లు పరశురాం, నాగేష్, టి ఏ రేవతి, వైఎస్ఆర్సిపి నాయకులు గుబాయ్ శ్రీరాములు, రామ్మూర్తి, జగన్నాథం, గ్రామస్తులు పాల్గొన్నారు.



