
(కర్నూలు ఆంధ్రన్యూస్)కర్నూలు జిల్లా మంత్రాలయంలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామి 354 వ సప్తరాత్రోత్సవాలలో భాగంగా నిర్వహించిన మహా రథోత్సవంలో జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ వారు పాల్గొన్నారు.పూజలు నిర్వహించారు.ఫాల్కన్ వాహనం,డ్రోన్ కెమెరాలు,బాడీ ఒన్ కెమెరాలు,సిసి కెమెరాల వంటి తదితర భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.పీఠాధిపతి తో జిల్లా ఎస్పీ మాట్లాడారు.పీఠాధిపతి జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ ని ఆశీర్వదించారు.భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దాదాపు 315 మంది పోలీసు బలగాలతో ఉత్సవాలలో భద్రత ఏర్పాట్లను ఏర్పాటు చేశామన్నారు.అనంతరం శ్రీమఠంలో క్యూ లైన్, దేవాలయ ప్రాకారం,పరిసర ప్రాంతాలను పరిశీలించారు.రాఘవేంద్రస్వామి మహారథోత్సవం సజావుగా జరగుతుండడం పట్ల జిల్లా ఎస్పీ ఐపీఎస్ వారు సంతృప్తి వ్యక్తం చేశారు.జిల్లా ఎస్పీ తో పాటు ఎమ్మిగనూరు డిఎస్పీ భార్గవి,స్పెషల్ బ్రాంచ్ సిఐ తేజమూర్తి,మంత్రాలయం సిఐ రామంజులు,స్పెషల్ బ్రాంచ్ ఎస్సై వేణుగోపాల రాజు,మంత్రాలయం ఎస్సై శివాంజల్, శ్రీ మఠం అధికారులు ఉన్నారు.



