
ములకలచెరువు , ఆంధ్రన్యూస్ : ములకలచెరువు మండలంలో ఇటీవల నిర్వహిస్తున్న మండల సర్వసభ్య సమావేశాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకుంటూ ఇబ్బందులు పెడుతున్నారంటూ మండలంలోని వైకాపా ప్రజా ప్రతినిధులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు మండల సర్వసభ్య సమావేశాలను సజావుగా అధికారులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో శుక్రవారం మండల ఎంపీపీ సాయి లీల, జెడ్పిటిసి మోహన్ రెడ్డి, మండలంలోని వైకాపాకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని, వారంలోగా మండల సర్వ సభ్య సమావేశాన్ని సజావుగా నిర్వహించి, మండలంలోని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని మొలకలచెరువు ఎంపీడీవోకు కోర్టు ఆదేశాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. దీంతో స్పందించిన ఎంపీడీవో మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తానని తెలిపారు. వీరి వెంట సర్పంచులు రాంబాబు, రవి శేఖర్ రెడ్డి, ఎంపిటిసిలు, వెంకటరమణారెడ్డి, ఆయుష చాంద్ బాషా, కృష్ణప్ప, రెడ్డి శేఖర్, వైకాపా నాయకులు ఉమామహేశ్వర్, కులదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



