
ఆంధ్రన్యూస్ : మండపేట: పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వేగుళ్ళ మాధవి బాబు తన తండ్రి స్వర్గీయ శ్రీ వేగుళ్ళ సూర్యారావు చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ట్రస్టు ద్వారా గత ఆరు సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టిన మండపేట చుట్టుప్రక్కల ప్రాంతాలకు చెందిన సుమారు ఐదువందల మంది స్వాములకు ప్రతిరోజు ఉదయం వడి, మధ్యాహ్నం భిక్షను మండపేట ఆలమూరు రోడ్డులో ఉన్న తమ అయ్యప్ప దీక్షా మందిరంలో ఏర్పాటు చేసారు. ఈ ఉదయం వడి, మధ్యాహ్నం భిక్ష కార్యక్రమానికి ప్రతిరోజు సుమారుగా 450 నుంచి 500 పైగా స్వాములుపాల్గొంటున్నారు. ఈ ఉదయం వడి,మధ్యాహ్నం భిక్ష,అక్టోబర్ 13 నుంచి జనవరి 14వ తారీకు వరకు ఈ కార్యక్రమం శ్రీ వేగుళ్ల సూర్యారావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జరుగుతుంది.



