
ఆంధ్రన్యూస్ : ఒంగోలు. వాసవి క్లబ్ కే సి జి ఎఫ్ యూత్ ఒంగోల్ సభ్యులు స్థానిక గానుగుపాలెంలోని బాలు బ్లైండ్ సెంటర్ కు నిత్యవసర సరుకుల వితరణ చేశారు. వాసవిజిల్లా 205 ఎ జిల్లా అధికారి చలువాది బాలసుబ్రమణ్యం కవితారాణి దంపతుల కుమారుడు ఆర్యన్ పుట్టినరోజును పురస్కరించుకొని శనివారం బాలు బ్లైండ్ సెంటర్ కు బియ్యం, పప్పు, నూనె తదితర నిత్యావసర సరుకులను పంపిణి చేశారు. ముందుగా చిన్నారి ఆర్యన్ కేక్ కట్ చేయగ, అందరూ చిన్నారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమములో క్లబ్ అధ్యక్షులు నూకల శ్రీనివాసరావు కార్యదర్శి సంకా శ్రీనివాసరావు కోశాధికారి కూనాల శ్రీనివాసరావు జోన్ చైర్మన్ చలువాది సత్యనారాయణ జిల్లా అధికారి చలువాది బాలసుబ్రమణ్యం, తుమ్మపూడి బుచ్చిబాబు, విస్సంశెట్టి అనిల్, మరియు క్లబ్ సభ్యులు పలువురు పాల్గొన్నారు.



