మెట్టజ్యోతి: అనకాపల్లి. భరత్ నగర్ బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పల్లి శ్రీనివాసనాయుడు అధ్యక్షతన బిజెపి ఓబీసీ జిల్లా పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశం ముందుగా అమర్నాథ్ యాత్రలో అసువులు బాసిన భక్తులకు ప్రధాన కార్యదర్శి సనపల రామకృష్ణ సంతాప తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది.అధ్యక్షులు మాట్లాడుతూ, రాజ్యసభకు ఎన్నికయిన జాతీయ అధ్యక్షులు కె లక్ష్మణ్ కి కమిటీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 15 వ తేది నుండి జిల్లా లో అన్ని మండల కమిటీ లు పూర్తి చేసుకొని, బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు పై పోరు బాట పట్టాలని అన్నారు.ప్రధాన కార్యదర్శి బొండా యల్లాజీ రావు మాట్లాడుతూ, బీజేపీ పార్టీ ఓబీసీ లకు ఎంత ప్రాధాన్యతనిస్తుందో జాతీయ అధ్యక్షులు కె లక్ష్మణ్ ని ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎంపిక చేయడం ద్వారా నిరూపితమయ్యిందని అన్నారు. ఇంకెన్నాళ్లు ఈ అవినీతి, కుటుంబ పార్టీల పల్లకీలు మొద్దామని ఇప్పటికైనా బీసీలు కళ్ళు తెరవాలని, బీజేపీ తోనే బీసీల అభివృద్ధి సాధ్యమని అన్నారు.ఈ సందర్బంగా లక్ష్మణ్ కి రాజ్యసభకు అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.ఉపాధ్యక్షులు యడ్ల రమణరాజు మాట్లాడుతూ, అత్యంత వెనుకబడిన కులాలకు కూడా సామజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చేసేందుకు ప్రధాని అనేక పథకాలు ప్రవేశ పెడుతున్నారని ఈ విషయాలు అన్నీ బీసీ సామజిక వర్గాలకు తీసుకువెళ్లి చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మన పైనే ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో జామి శివాజీరావు, బోడ శ్రీనివాస్, వీసా వెంకటరమణ, పసుపులేటి శ్రీనివాస్, రుగడ శ్రీనివాస్, నారాయణరావు, అప్పలరాజు, అక్కునా యుడు పెద్ద ఎత్తున నాయకులు పాల్గొన్నారు
బీజేపీ ఓబీసీ జిల్లా పదాధికారుల సమావేశం.
RELATED ARTICLES