Wednesday, January 21, 2026
spot_imgspot_imgspot_imgspot_img
Homeకర్నూలు జిల్లాబిసిల పేరుతో బహిరంగ దోపిడీకి పాలు పడుతున్న వ్యక్తులపై మండిపడిన మంత్రాలయం నియోజకవర్గ బిసి విభాగపు...

బిసిల పేరుతో బహిరంగ దోపిడీకి పాలు పడుతున్న వ్యక్తులపై మండిపడిన మంత్రాలయం నియోజకవర్గ బిసి విభాగపు అధ్యక్షులు నాడిగేని నాగరాజు..

(ఆంధ్రన్యూస్ కర్నూలు)
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం బిసిల పేరుతో బహిరంగ దోపిడీ పాల్పడుతుందని మంత్రాలయం నియోజకవర్గ వైఎస్సార్సీపీ బిసి విభాగపు అధ్యక్షులు నాడిగేని నాగరాజు విమర్శించారు.
గురువారం కోసిగి తాహశీల్దార్ కార్యాలయం నందు మండల ఉపాధ్యక్షులు ముకుంద కృష్ణమూర్తి,వైఎస్సార్సీపీ వాలింటీర్ల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేష్,జిల్లా ఆర్టిఐ విభాగం కార్యదర్శి ప్రతాప్,మండల కార్యదర్శులు బుళ్ళి నరసింహులు,బండ్ల గోవిందు, నాడిగేని వీరేష్ తదితరుల బిసి నాయకులతో కలిసి వినతి పత్రాన్ని తాహశీల్దార్ రుద్ర గౌడ్ కి యన్ నాగరాజు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,రాష్ట్రంలో బిసి మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ,శిక్షణ కోసం ప్రభుత్వం దాదాపు 230కోట్ల రూపాయలను కేటాయించిందని,తమ అనుకూల కాంట్రాక్టర్లల ద్వారా బారీ దోపిడీకి పన్నాగం పన్నుతోందని వారు ఆరోపించారు.ఇటివల రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది మహిళలకు 50రోజుల పాటు కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించిందని,శిక్షణకు హాజరైన ప్రతి బిసి మహిళకు 3వేల రూపాయలు స్టైఫండ్ గా ఇస్తూ,శిక్షణ అనంతరం కుట్టు మిషన్ ఉచితంగా అందజేసేలా కార్యాచరణ రూపొందించారని వారు తెలిపారు.ఇందుకోసం ప్రభుత్వం ఒక్కొక్క మహిళకు 23వేల రూపాయలు వేచ్చిస్తున్నట్లు ప్రభుత్వం తెలుపుతుంటే, స్టైఫండ్, ఉచితంగా అందించే కుట్టు మిషన్ పోను మిగిలిన డబ్బులు నొక్కేశారని వారు ఆరోపించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments