
బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం
పెదపూడి, మెట్టజ్యోతి బ్యూరో ప్రసాద్ పలివెల : కాకినాడ జిల్లా పెదపూడిలోని కృపా ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఇద్దరికీ తీవ్ర గాయాలు, అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.పెదపూడి తహసీల్దార్ సుభాష్ ,ఎస్ఐ పి వాసు తెలిపిన వివరాల ప్రకారం పెదపూడి గ్రామ శివారున కృప ఫైర్ వర్క్ పేరుతో దూలపల్లి శ్రీను అనే వ్యక్తి ఫైర్ వర్క్స్ నిర్వహిస్తున్నడు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో కరెంట్ షాట్ సర్క్యూట్ కారణంగా ఫైర్ వర్క్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో అక్కడ పనిచేస్తున్న డోకు బుర్ర రాజు(45) పల్లపాటి శేషరావు(35 ) లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని పెదపూడి సామాజిక ఆరోగ్య కేంద్రం లో ప్రాథమిక చికిత్స అనంతరం కాకినాడ జిజిహెచ్ కు తరలించారు. సామర్లకోటకు చెందిన డోకు బుర్ర రాజు(45) పల్లంపాటి శేషరావు(35)వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఫైర్ వర్క్స్ ఓనర్ దూలపల్లి శ్రీను కు స్వల్ప గాయాలయ్యాయి. పెదపూడి ఎస్సై వాసు,తహసీల్దార్ సుభాష్ లు ప్రమాద స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాద ఘటనపై పెదపూడి గ్రామ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు మంటలను అదుపు చేసేందుకు కాకినాడ ఫైర్ స్టేషన్ సిబ్బంది చాయశక్తుల కృషిచేసి మంటలను అదుపు చేశారు.



