Saturday, December 6, 2025
spot_imgspot_imgspot_imgspot_img
Homeకొనసీమ జిల్లాబాటసారుల దాహార్తి తీర్చేందుకు రాయవరం లో ఏర్పాటు చేసిన చలివేంద్రం

బాటసారుల దాహార్తి తీర్చేందుకు రాయవరం లో ఏర్పాటు చేసిన చలివేంద్రం

బాటసారుల దాహార్తి తీర్చేందుకు రాయవరం లో ఏర్పాటు చేసిన చలివేంద్రం
సర్పంచ్ చంద్రమళ్ళ రామకృష్ణ

రాయవరం, మెట్టజ్యోతి బ్యూరో ప్రసాద్ పలివెల : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం మండల కేంద్రమైన రాయవరం గ్రామం లో ఈరోజు సర్పంచ్ చంద్రమళ్ళ రామకృష్ణ, వైస్ సర్పంచ్ బొడ్డు శ్రీను. సౌజన్యంతో రాయవరం మెయిన్ రోడ్డు
ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న పాత బస్టాండ్ వద్ద గ్రామపంచాయతీ వారి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చంద్రమళ్ళ రామకృష్ణ మాట్లాడుతూ రాయవరం మండల కేంద్రం కాబట్టి ఆఫీసులకు షాపింగ్ ల కొరకు మండలంలో ఉన్న గ్రామ ప్రజలు అనేకమంది వస్తూ ఉంటారు, వేసవి తాపానికి తట్టుకోలేక ఉన్నవారికి దాహం తీర్చేందుకు మంచినీరు ఏర్పాటు చేశాం అన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి సీనియర్ నాయకులు తమలంపూడి గంగాధర్ రెడ్డి, కొల్లు రాంబాబు, చంద్రమళ్ళ రాజు, సచివాలయం సెక్రటరీ నాగచంద్రాదేవి, ఫీల్డ్ అసిస్టెంట్ సబెళ్ళ రమేష్ రెడ్డి, సచివాలయం సిబ్బంది వాలంటీర్లు, గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments