
బలభద్రపురం లో పతంజలి వారి అద్వర్యం లో ఆయిల్ పామ్ తోటల విస్తరణ..
ఆంధ్రాన్యూస్,బిక్కవోలు,ఆగస్ట్:03 తూర్పుగోదావరిజిల్లా అనపర్తి నియోజికవర్గం బిక్కవోలు మండలం బలబద్రపురం గ్రామంలో పతంజలి వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆయిల్ ఫామ్ తోటల విస్తరణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ రైతులకు యాజమాన్య పద్ధతులు మెళకువలలో అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని అదేవిధంగా పామాయిల్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేయాలని ఈ విషయమై పార్లమెంటు సభ్యులుతో చర్చించి కేంద్రం దృష్టికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆయిల్ ఫెడరేషన్ అధ్యక్షులు మరియు అనపర్తి మాజీ జడ్పిటిసి సభ్యులు సత్తి రామారెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త తేతలి రాధాకృష్ణ రెడ్డి (రాధ), బిక్కవోలు ఎం.పి.పి.కొవ్వూరి జోతిర్మయి సత్యనారాయణ రెడ్డి(సత్తిబాబు), అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, SAAP డైరెక్టర్ గుబ్బల అలేఖ్య లాజర్ బాబు, AMC వైస్ చైర్మన్ అడబాల వెంకటేశ్వరరావు, జడ్పి కోఆప్షన్ సభ్యులు లంక చంద్రన్న, రిమ్మలపూడి వెంకటేశ్వరరావు (అబ్బు), సర్పంచ్ బుంగ రామారావు, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ నల్లమిల్లి వెంకటరెడ్డి, ఎంపీటీసీలు సబ్బేళ్ళ సుజాతావీరరాఘవరెడ్డి, మేడపాటి ఆనంద్ రెడ్డి, చిన్నం వీర రాఘవరెడ్డి, ఫైనాన్స్ సత్తిబాబు, నల్లమిల్లి సుధారాము, వేము చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు..



