Saturday, December 6, 2025
spot_imgspot_imgspot_imgspot_img
Homeతూర్పుగోదావరి జిల్లాబలబద్రపురం లో పురుషోత్తమ రెడ్డి ఝాన్సీ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు

బలబద్రపురం లో పురుషోత్తమ రెడ్డి ఝాన్సీ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు

బలబద్రపురం లో పురుషోత్తమ రెడ్డి ఝాన్సీ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు

బిక్కవోలు, ఆంధ్రన్యూస్ బ్యూరో ప్రసాద్ పలివెల : తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలబద్రపురం గ్రామంలో విద్యా ప్రదాత, బలభద్రపురం సాయి నాధుని ఆలయ నిర్మాణ కర్త సబ్బెళ్ల వీర వెంకట కృష్ణ పురుషోత్తమ రెడ్డి ఝాన్సీ దంపతులు పెండ్లి రోజు సందర్బంగా ఈ రోజు అభిమానులు కోలాహలం గా వేడుకలు నిర్వహించారు. బలభద్రపురం కె ఆర్ కె సంక్షేమ చారిటి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించడం జరిగింది. ట్రస్ట్ కార్యవర్గం పురుషోత్తమ రెడ్డి ఇంటివద్ద దంపతులు ఇరువురు కి సత్కారం చేసి కేకు తినిపించి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా కె ఆర్ కె ట్రస్ట్ వ్యవస్థాపకులు కర్రి రామ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ పురుషోత్తమ రెడ్డి దంపతులు గ్రామ అభివృద్ధి కి ఎంతో సహకారం ఇస్తూ హైస్కూల్, సాయి బాబా ఆలయం వంటి ముఖ్య భూమిక లలో వీరి సేవలు అమోఘం అని కొనియాడారు. తమ ట్రస్ట్ అభివృద్ధి లో వీరి పాత్ర ఎంతో ఉందని ఆయన అన్నారు. ఈ సందర్బంగా ట్రస్ట్ తరపున కర్రి సుధాకర రెడ్డి, యెల్ల బుచ్చి లింగం, మేడపాటి సత్యనారాయణ రెడ్డి,కొర్నాల శ్రీనివాస్ యాదవ్, సత్తి ఉదయ భాస్కర రెడ్డి, పంపనబోయిన సూరిబాబు గుండాపు యేసు, పాండ్రింకి చిన్న, కె శ్రీమన్నారాయణ, డొకుబుర్ర చిన్నా రావు, కర్రి వెంకట రెడ్డి, బిక్కవోలు మీడియా అసోసియేషన్ ప్రతినిధులు రేవు సురేష్ బాబు, పలివెల ప్రసాద్, సుర్ల శ్రీనివాస్ చిట్టి బాబు తదితరులు హాజరై పురుషోత్తమ రెడ్డి ఝాన్సీ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు, కె ఆర్ కె ట్రస్ట్ అధ్యక్షులు యెల్ల బుచ్చి లింగం ట్రస్ట్ తరపున పూల బొక్కే తో అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా కె ఆర్ కె ట్రస్ట్ ఆధ్వర్యంలో ని నిరుపేద వృద్ధులకు మూడు పూటలా అన్నదానం గావించి పురుషోత్తమ రెడ్డి వారి ఆకలి తీర్చారు. సుమారు 40మంది వృద్ధులు ఈ అన్నదానం లో పాల్గొని ఆకలి తీర్చుకొని అన్నదాత సుఖీభవ అని పురుషోత్తమ రెడ్డి ఝాన్సీ దంపతులను ఆశీర్వదించారు. తనపై తన కుటుంబం ఫై అభిమానం తో వచ్చి మాకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ పురుషోత్తమ రెడ్డి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments