Saturday, December 6, 2025
spot_imgspot_imgspot_imgspot_img
Homeకర్నూలు జిల్లాప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల వ్యాపారాన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు అరికట్టాలి-SSA,DSF,PSA,RSF..

ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల వ్యాపారాన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు అరికట్టాలి-SSA,DSF,PSA,RSF..

(ఆంధ్రన్యూస్ కర్నూలు)
కర్నూలు నగరంలో విద్యను వ్యాపారం చేస్తున్న బన్సల్, విసిడం,శ్రీలక్ష్మి,ఎడిఫై,పిల్ల ఓపెన్ మైండ్,రవీంద్ర విద్యాసంస్థలు నగరంలో వేసినటువంటి కార్పొరేట్,ప్రవేట్ విద్యాసంస్థల బ్యానర్లను చించి వేస్తూ సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్(ఎస్ ఎస్ ఏ ) రాష్ట్ర అధ్యక్షులు శివప్రసాద్ గౌడ్,డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ధనాపురం ఉదయ్,ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ అసోసియేషన్(పి ఎస్ ఏ) రాష్ట్ర అధ్యక్షులు పాగంటి రాజు,రిపబ్లిక్ న్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఆర్ ఎస్ ఎఫ్) జిల్లా కార్యదర్శి మహేష్ C-క్యాంపు సెంటర్ నందు కరపత్రాలు మరియు ప్లెక్సీలు దహనం చేస్తూ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి పెద్దపెద్ద హోల్డింగ్లు అలాగే రంగురంగుల బ్యానర్లు,కరపత్రాలతో విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించి ముందస్తు అక్రమ అడ్మిషన్లు చేస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల పై తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.గతంలో ప్రజా పరిష్కార వేదికలో కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చిన ఫలితం లేకపోయింది అన్నారు,అలాగే జిల్లా విద్యాశాఖ అధికారులకు,వినతి పత్రాలు ఇచ్చిన ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.అలాగే ప్రవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు వత్తాసు పలుకుతున్నారన్నారు.అందువల్ల కర్నూల్ నగరం ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల బ్యానర్లు తొలగిస్తూ మరియు ఆ బ్యానర్లను కాల్చి వేయడం జరిగింది ఇప్పటికైనా కలెక్టర్ మరియు డీఈవో,ఆర్ ఐ ఓ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది.లేనిపక్షంలో పెద్ద ఎత్తున విద్యాసంస్థల ముందు, అధికారుల ముందు ప్రత్యక్ష ఉద్యమాలు ఉదృతం చేస్తామని విద్యార్థి నాయకులు హెచ్చరించడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో రవి సురేష్ మధు ప్రవీణ్ రాజేష్ అరుణ్ వికాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments