
రాయచోటి : ఆంధ్రన్యూస్. వీరబల్లె మండలం వీరబల్లె గ్రామపంచాయతీలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి నెల లాగే ఈనెల కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన వీరబల్లె ఎంపీపీ శ్రీ గాలివీటి రాజేంద్రనాథ్ రెడ్డి గారు పీఎం ఎస్ఎంఎ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 9వ తేదీ 10వ తేదీ ప్రత్యేక నిపుణులైన డాక్టర్లచే వైద్యపరీక్షల నిమిత్తం హాస్పటల్ కు అన్ని గ్రామాల నుంచి వచ్చు గర్భిణీ మహిళలకు మధ్యాహ్నం భోజన సదుపాయం కల్పించడం శుభ సంతోషం గత మూడు సంవత్సరాల నుండి మండల వ్యాప్తంగా ఉన్న గర్భిణీ మహిళలకు పరీక్షలు నిమిత్తం వచ్చు ప్రతి గర్భిణీ మహిళకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఎంపీపీ గాలివీటి రాజేంద్రనాథ్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేసిన వీరబల్లె వైద్యాధికారిణి డాక్టర్ మనీషా గారు
ఈ కార్యక్రమంలో వీరబల్లె వైద్యాధికారిణి డాక్టర్ మనీషా గారు, సిహెచ్వో సుధాకర్ గారు సూపర్వైజర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఆశా వర్కర్లు, ఇతర గ్రామాల వైద్య సిబ్బంది, గర్భిణీ మహిళలు, సహాయకులు పాల్గొన్నారు.



