Wednesday, January 21, 2026
spot_imgspot_imgspot_imgspot_img
Homeతూర్పుగోదావరి జిల్లాప్రయాణికుడి ఫిర్యాదుకు స్పందించిన సౌత్ సెంట్రల్ రైల్వే శాఖ అధికారులు

ప్రయాణికుడి ఫిర్యాదుకు స్పందించిన సౌత్ సెంట్రల్ రైల్వే శాఖ అధికారులు

ప్రయాణికుడి ఫిర్యాదుకు స్పందించిన సౌత్ సెంట్రల్ రైల్వే శాఖ అధికారులు

అనపర్తి , ఆంధ్రన్యూస్ బ్యూరో : తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బిక్కవోలు మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మరియు శ్రీ ప్రస్థానం రిపోర్టర్ గా పనిచేస్తున్న ఎం.వి.వి.ఎస్.ఎన్.రెడ్డి రైల్వే శాఖ వారికి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంజాయిషి ఇస్తూ ఉత్తర్వులు పంపడం జరిగిందని ఆయన మీడియాకు వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 30వ తేదీన విశాఖపట్నం నుండి హైదరాబాదు వెళ్ళు గోదావరి ఎక్స్ప్రెస్ రైలుకి అనపర్తి నుండి వరంగల్ వరకు స్లీపర్ క్లాస్ టికెట్ బుక్ చేసుకుని అనపర్తి స్టేషన్లో రైలు ఎక్కుటకు ప్రయత్నించగా రిజర్వేషన్ లేని ప్రయాణికులు గుమ్మానికి అడ్డుగా ఉండి రైలు ఎక్కనివ్వకపోవడంతో వేరే భోగి ఎక్కి తను వెళ్లవలసిన భోగికి వెళ్లే ప్రయత్నం చేయగా రిజర్వేషన్ లేని ప్రయాణికులు తనను ఎటు కాదలనివ్వకుండా చేయడమే కాకుండా రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు సీట్లలో రిజర్వేషన్ లేని ప్రయాణికులు కూర్చుని రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులకు సీట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం జరిగిందని ఇంతలో రాజమండ్రి రైల్వే స్టేషన్ రావడంతో రాజమండ్రి నుండి బయలుదేరుతున్న గోదావరి ఎక్స్ప్రెస్ చైన్ లాగి ఆపగా రైల్వే శాఖ అధికారులు వచ్చి వివరణ అడిగి తెలుసుకుని రిజర్వేషన్ లేని ప్రయాణికులను దించడమే కాకుండా కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుని దానిపై విచారణ చేసి ఇకముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామంటూ సంజాయిషీ ఉత్తర్వులు పంపారని ఆయన తెలిపారు రైల్వే ప్రయాణికులు ఉద్దేశించి మాట్లాడుతూ ఎప్పుడైనా రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులకు ఇబ్బంది కలిగినప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు రైల్వే అధికారుల నుండి సమాచారం సహాయం రానప్పుడు ఏ స్టేషన్లో అయితే ఆగుతుందో ఆ స్టేషన్లో చైన్ లాగి నిరసన తెలుపవచ్చని అయితే అది సరైన ఫిర్యాదు అయి ఉండాలని లేకపోతే తిరిగి అది మన పైనే పడి అపరాధ రుసుము చెల్లించవలసి ఉంటుందని ఆయన వివరించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments