Sunday, January 25, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeUncategorizedప్రమాదానికి గురైన జాహ్నవి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జనసైనికులు

ప్రమాదానికి గురైన జాహ్నవి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జనసైనికులు

బిక్కవోలు, ఆంధ్రన్యూస్ : తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామనికి చెందిన వాసంశెట్టి వీరబాబు కుమార్తె జాహ్నవి ఇటీవల జరిగిన దీపావళి పండుగ రోజు బాణాచంచా కాలుస్తూ ప్రమాదానికి గురికావడం జరిగింది.  వైద్య ఖర్చులకు నిమిత్తం సుమారు10 లక్షలు అవుతుంది అని జన సైనికులు తెలుసుకొని వారిది వైద్యము చేయించుకోలేని నిరుపేద కుటుంబ కావడంతో బిక్కవోలు మండల జనసైనికులు మరియు అనపర్తి నియోజకవర్గం జనసైనికులు సమాకూర్చిన 123,000రూపాయలు మర్రెడ్డి శ్రీనివాసు చేతులు మీదుగా జాహ్నవి కుటుంబనికి అందచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మర్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాలనే మంచి సంకల్పంతో  పవన్ కల్యాణ్ పాటు పడుతున్నారని ఆయన బాటలోనే నడవాలనే ఆలోచనతో అనపర్తి నియోజకవర్గ జనసైనికులు మాకూర్చిన 123,000   రూపాయలు  సహాయం అందించటం అభినందనీయమని, జనసైనికుల కుటుంబనికి ఏ ఆపద వచ్చిన పార్టీ అండగాఉంటుంది నీ తెలియజేశారు కార్యక్రమంలో సమన్వయ కర్త రావాడ నాగు, బిక్కవోలు మండలపార్టీ అధ్యక్షులు ఇందల వీరబాబు, తోట సతీష్ (పండు) ,గుత్తుల శివ కొండబాబు, కమకు అరుణ్ కుమార్,  వడ్లమురి గోవిందు రాజులు, నంద్యాల హరీష్ ,పోస్ట్ మెన్ వెంకణబాబు, పందలపాక నవీన్, రంగపురం దాసు, శివ, కర్రీ శ్రీను, జన సైనికులు జాహ్నవి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments