జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు.
మెట్టజ్యోతి కిర్లంపూడి కాకినాడ జిల్లా : దళితవాడల్లో మౌలిక వసతులు కల్పనకు తమ ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అన్నారు. కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో 42 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించనున్న మంచినీళ్లు ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం కొరకు ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరించారు. గ్రామానికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యునకు స్థానిక వైయస్సార్ పార్టీ నాయకులు పెంటకోట నాగబాబు నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా ఎమ్మెల్యే చంటిబాబు కిర్లంపూడి ఎంపీపీ తోట రవి, జడ్పిటిసి సభ్యుడు తోట గాంధీ వైస్ ఎంపీపీ బొడ్డేటి గణపతి, గ్రామ సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు, మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు ల చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. అదేవిధంగా స్థానిక దళితులకు మంజూరు చేసిన జగనన్న ఇళ్ల స్థలాల యొక్క పనితీరును అక్కడికి వెళ్లి స్వయంగా స్థానిక వైసిపి నాయకులను అడిగి తెలుసుకున్నారు. దళితవాడ ప్రాంతానికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యునికి స్థానికంగా రామాలయం నిర్మించాలని అక్కడ ఉన్న దళిత మహిళలు ఎమ్మెల్యేకు విన్నవించారు. తక్షణమే రామాలయం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్నా అధికారులకు, వైయస్సార్ పార్టీ నాయకులకు ఎమ్మెల్యే చంటిబాబు సూచించారు. ఈ సందర్భంగా జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారని వివరించారు. అందులో భాగంగానే గ్రామంలో త్రాగునీటి సమస్య అన్నది తెలియకుండా ఇంటింటికి పైపులైన్లు వేసి తద్వారా త్రాగునీరు అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీడియా ద్వారా తెలిపారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాజకీయాలను పక్కనపెట్టి సక్రమంగా అమలయ్యేలా ముందుకు సాగాలని ఎమ్మెల్యే చంటిబాబు స్థానిక నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బి. సతీష్ బాబు, మండల పార్టీ అధ్యక్షుడు దోమాల గంగాధర్, రాష్ట్ర డైరెక్టర్ సంగన వెంకటేశ్వరరావు, స్థానిక ఎంపీటీసీ సభ్యుడు కాళ్ల దొంగబాబు, మండల యూత్ నాయకులు పెనగంటి రాజేష్, యల్లపు నానాజీ, రాపేటి ప్రసాద్, దాడి పెదబుజ్జి, దాడి అప్పలరాజు, నియోజకవర్గ మీడియా కన్వీనర్ శెట్టి సోమరాజు, విద్యా కమిటీ చైర్మన్ ఆళ్ల రామ శివ, వార్డు మెంబర్లు రెల్లి శేషులు, శరకణం సంతోష్, వేగి సాంబశివ, గ్రామ వైసీపీ నాయకులు ఆడారి మహేష్, దిడ్డి గణపతి, పీలా లోవ సుబ్రహ్మణ్యం, ఆడారి గంగ బాబు, ఆళ్ల బాబులు, పెంటకోట రామకృష్ణ, మాకా నాగేశ్వరరావు, మూరా నాగభూషణం, జిల్లా యాదవ సంఘం ఉపాధ్యక్షుడు నైధాన రఘు, మండల యాదవ సంఘం నాయకుడు ఇసరపు సూరిబాబు, కాంట్రాక్టర్లు శరకణం పెదకాపు, సింహాద్రిపురం శ్రీను, తదితర వైయస్సార్ పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.