
మెట్టజ్యోతి: జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బిజెపి కార్యాలయంలో బుధవారం బిజెపి ధార్మిక సెల్ జిల్లా కన్వీనర్ కొప్పాక శ్రీనివాసరావు పట్టణ ధార్మిక సెల్ అద్యక్షులు తుమ్మలపల్లి బ్రహ్మాజీ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని.. మరో ఐదు సంవత్సరాలు కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంటే ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలుస్తుందన్నారు. సంక్షేమం, అభివృద్ధి దిశగా దేశాన్ని ప్రధాని ముందుకు నడిపిస్తున్నారు అన్నారు. ఎన్నో సం.ల నుండి పెండింగ్లో ఉన్న కాశ్మీర్ సమస్య, అయోధ్య రామ మందిరం, పరిష్కరించారు అని తెలియజేశారు. పట్టణ ధార్మిక సెల్ అధ్యక్షులు తుమ్మలపల్లి బ్రహ్మాజీ మాట్లాడుతూ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో శరవేరంగా నేషనల్ హైవేస్ గత ప్రభుత్వాల కంటే చాలా అద్భుతంగా నిర్మించారని, ఎస్సీ ఎస్టీ వర్గాలకు స్టాండప్ ఇండియా మేకింగ్ ఇండియా ద్వారా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారని, ఈ తొమ్మిది సంవత్సరాలలో ఒక్క అవినీతి లేకుండా నిరంతరం ఒక్కరోజు కూడా సెలవు తీసుకొని అలుపెరగని మన ప్రధాన నరేంద్ర మోడీ అని, దేశము దేశ ప్రజలు అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తున్నారని ఒక్కసారి తిరిగి ఫిర్ ఏక్ బార్ మోడీ అనే నినాదంతో ప్రజల ముందుకు వెళతామని మూడోసారి దిగ్విజయంగా విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సాయి సింగ్, చలమాల శ్రీను పాల్గొన్నారు



