
(కర్నూలు ఆంధ్రన్యూస్)మహిళల భద్రత కోసమే శక్తియాప్.
శక్తి యాప్ మార్చి 8న ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు జిల్లాలో 14,137 మంది శక్తి యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారని ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి మహిళ శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ వారు తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా శక్తి యాప్ ద్వారా డయల్ 112, ఎస్ ఓ ఎస్ బటన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు.మహిళలకు పోలీసులు అత్యవసర సహాయం అందించేందుకు శక్తి యాప్ పనిచేస్తుందన్నారు.శక్తి యాప్ 7993485111 నెంబర్ కు మహిళలు కాల్ చేసినా,మెసేజ్ చేసినా సంబంధిత కమాండ్ కంట్రోల్ రూమ్ కు సంకేతాలు వెళ్లిన వెంటనే శక్తి టీమ్ స్పం దించి ఆపదలో ఉన్న మహిళలను ఆదుకుంటారన్నారు.జిల్లాలో మహిళల రక్షణ కోసం శక్తి టీములను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు.శక్తి టీములను జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్ టీముతో సహా కర్నూలు,ఆదోని, పత్తికొండ,ఎమ్మిగనూరు సబ్ డివిజన్ల పరిధిలో మొత్తం 5 శక్తి టీములను ఏర్పాటు చేశామన్నారు.ఒక్కో టీములో ఇద్దరు మహిళలు,4 గురు పురుషులతో కలిపి మొత్తం 6 గురు పోలీసులు ఉంటారన్నారు.ఈవ్ టీజింగ్ కు పాల్పడే వారిని గుర్తించి చర్యలు తీసుకోవడం కోసం ప్రత్యేక హాట్ స్పాట్లను గుర్తించి అక్కడ ఈ టీములు పనిచేస్తూ ఉంటాయన్నారు.ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నపిల్లలకు వీడియోల ద్వారా గుడ్ టచ్,బ్యాడ్ టచ్ ల గురించి అవగాహన కల్పిస్తున్నారన్నారు.పాఠశాలల్లో, ఇంటర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఈవ్ టీజింగ్,బాల్య వివాహాలు,ప్రేమ మోసాలు,సోషల్ మీడియా ప్రభావం,సైబర్ క్రైమ్,విద్యా ప్రాధాన్యత వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.చైల్డ్ లైన్ 1098 కు గాని, డయల్ 112 కి గాని,సైబర్ నేరాల నివారణ కోసం డయల్ 1930 నెంబర్లకు ఫోన్ చేసి సహాయం కోసం సంప్రదించాలన్నారు.శక్తి ఎస్ ఓ ఎస్ యాప్ లో కానీ,వాట్సప్ నెంబర్ 7993485111 నెంబర్లో కానీ సంప్రదించవచ్చన్నారు.



