ఆంధ్రన్యూస్ : పాత్రికేయులు సమాజ హితం కోరి సమాజానికి అందిస్తున్న వాస్తవ కథనాలు ప్రతి ఒక్కరూ హర్షించే విధంగా ఉండాలే తప్ప ఈ వృత్తిని ఫణంగా పెట్టి తప్పుడు మార్గాలను అన్వేషించేందుకు ముందుకు సాగరాదని ఆంధ్రన్యూస్ చానల్ మరియు మెట్టజ్యోతి సీ.ఈ.వో పడాల నాగబాబు అలాగే ప్రముఖ వ్యాపారవేత్త అయిన పడాల కమలారెడ్డి పాత్రికేయులకు సూచించారు. పాత్రికేయ వృత్తిలో మంచి నడవడికతో క్రమశిక్షణ కలిగి ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు ఇచ్చే సాంప్రదాయం ఆంధ్రన్యూస్ మరియు మెట్టజ్యోతి సంస్థలకు ఉన్నప్పటికీ గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి ప్రజలందరినీ పట్టిపీడిస్తుoడడం వల్ల ఈ అవార్డుల ప్రధానం తాత్కాలికంగా నిలిపి వేయడం జరిగిందని వారిరువురు పాత్రికేయులకు వివరించారు. నిలిచిపోయిన అవార్డుల ప్రధానాన్ని మరల అనపర్తి మండలం రాయవరం గ్రామంలో అందించేందుకు ఆ ప్రాంత సీనియర్ రిపోర్టర్ పలివెల ప్రసాద్ నేతృత్వంలో ఏర్పాటు చేయడంతో తాము ముఖ్యఅతిథిలుగా రాయవరానికి విచ్చేయడం జరిగిందని సీ.ఈ.ఓ నాగబాబు మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సీనియర్ రిపోర్టర్గా కొనసాగుతున్న పలివేల ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించగా రాష్ట్రo నలుమూలల ఆంధ్రన్యూస్ మరియు మెట్టజ్యోతి సంస్థలలో రిపోర్టర్లగా పనిచేస్తున్న పలువురు స్టింగర్లు రాయవరం గ్రామానికి చేరుకున్నారు. ముందుగా పడాల కమలరెడ్డి వ్యాపార ప్రాంగణంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో పలు అంశాలను సీనియర్ రిపోర్టర్ల ముందు మండలం, నియోజకవర్గంలో పనిచేస్తున్న రిపోర్టర్లు ప్రస్తావించారు. సంస్థలు ఇంత వేగవంతంగా అభివృద్ధి చెందడానికి సీ.ఈ.వో పడాల నాగబాబు పడ్డ శ్రమ నోటి ద్వారా చెప్పలేనిదని పలువురు వక్తలు ప్రశంసించారు. ఏదైనా సరైన ఆలోచనతో దృఢ సంకల్పంతో ముందుకు సాగినప్పుడే ఊహించని ఫలితాలను మనమంతా సొంతం చేసుకోగలమన్న సంగతి ప్రతి ఒక్క రిపోర్టర్ గుర్తేరగాలని సభలో పాల్గొన్న సీనియర్ రిపోర్టర్లు కంటిబ్యూటర్లకు సూచించారు. అనంతరం అన్ని జిల్లాల నుండి వచ్చిన రిపోర్టర్లకు పాత్రికేయంలో వారు పనిచేసిన తీరును గుర్తించి అవార్డులను ప్రధానం చేశారు. అదేవిధంగా పలువురు రిపోర్టర్లు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా వివిధ సంస్థలలో రిపోర్టర్ల గా పని చేసినప్పటికీ తమకు ఎక్కడ సరైన గుర్తింపు లేకపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి తరుణంలో అనతికాలంలోనే ఆంధ్రన్యూస్ మరియు మెట్టజ్యోతి సంస్థలలో రిపోర్టర్ల గా చేరి పనిచేస్తున్న తామంతా ఇంత అరుదైన అవార్డులను సీఈఓ చేతుల మీదుగా అందుకోవడం చాలా గర్వంగా ఉందని వారన్నారు. అలాగే సీఈవో పడాల నాగబాబు రిపోర్టర్లను ఉద్దేశిoచి మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో పుట్టగొడుగులు మాదిరిగా ఎటువంటి గుర్తింపులేని కొన్ని సంస్థలు మీడియా రూపంలో అయోమయానికి గురి చేస్తున్నారని గుర్తు చేశారు. అటువంటి వారిపట్ల ఎక్కడికక్కడ చాలా అప్రమత్తంగా ఉండకపోతే వారి చేసిన పొరపాట్లకు మిగతా వారు కూడా ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చని ఆయన పేర్కొన్నారు. అందుచేత విధినిర్వహణలో మంచి ఆలోచనలను ఒడిసి పట్టుకొని ప్రజా సమస్యలపై దృష్టిసారించి ఆ సమస్యలను ప్రభుత్వ ఉన్నత అధికారులకు చేరవేసే విధంగా మీరు చేపట్టిన వృత్తి ద్వారా పాటుపడాలని సీఈవో పాత్రికేయులకు హితవు పలికారు. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాల నుండి బెస్ట్ పెర్ఫార్మెన్స్ రిపోర్టర్గా జగ్గంపేట ప్రత్తిపాడు నియోజకవర్గాలలో ఆంధ్రన్యూస్, మెట్టజ్యోతిలలో పనిచేస్తున్న సీనియర్ రిపోర్టర్ శరకణం అంజిబాబు కు అవార్డు అందజేయడం పట్ల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు జగ్గంపేట మాజీ శాసన సభ్యుడైన జ్యోతుల నెహ్రూ అంజిబాబు ని పూలమాలవేసి దుశ్శాలువతో అభినందించడం జరిగింది. అలాగే దానితో పాటు ఆంధ్రన్యూస్, మెట్టజ్యోతి సంస్థలను అభివృద్ధి పధంలో తీసుకువెళ్లడానికి అహర్నిశలు కష్టించి పనిచేస్తున్నా సీ.ఈ.వో పడాల నాగబాబుకు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రత్యేకంగా అభినందనలను తన చరవాణి ద్వారా తెలియచేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి చెరుకూరి రిషేంద్రవర్మ, రేవు సురేష్, కండవల్లి భారత్, అకెళ్ళ కృష్ణమూర్తి, బి లక్ష్మణస్వామి, ఆంధ్రన్యూస్ మరియు మెట్టజ్యోతి రిపోర్ట్రర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు.
RELATED ARTICLES