
పూతలపట్టు నియోజకవర్గం, ఆంధ్రాన్య్యూస్ : చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం లో అదనంగా 1000 మినీ గోకు లాలు కోసం దరఖాస్తు చేయడం జరిగింది. స్పం దించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తక్షణమే అధికారులను ఆదేశించడం జరిగింది. అలాగే పూతలపట్టు నియోజకవర్గానికి సంబంధించిన వారి అనారోగ్యం పాలైన వారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆర్థిక సహాయం కోసం విజ్ఞప్తి చేయగా తక్షణమే స్పం దించి వారికి ఆర్థిక సహాయం చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గత వైసిపి హయాంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ శాఖ మంత్రిగా ఉన్న శాఖలో జరిగిన అవినీతి అక్రమాలు నగరవనాల నిర్మాణాలు, ఫారెస్ట్‌లో అనుమతి లేకుండా రోడ్లు, అక్రమ మైనింగ్ లైన్లు, భవనాల నిర్మాణం,పైన విచారణ జరిపించమని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది.



