కౌతాళం (ఆంధ్రన్యూస్)
కౌతాళం మండలంలోని కౌతాళం గ్రామం లో 11వ వార్డ్ వీధి రోడ్లు లకు గాను సి.సి రోడ్ పనులను ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి సహకారంతో దేశాయ్ ప్రహల్లాద్ ఆచారి ఆధ్వర్యంలో సర్పంచ్ పాల్ దినాకర్ మొదటి సి.సి రోడ్ పనులను ప్రారంభించారు.ఆ కాలనీవాసులు చాలా ఇబ్బందికరంగా మారిందని ప్రజలు కోరగా కోరిన వెంటనే మంత్రాలయం శాసనసభ్యులు వై బాలనాగి రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి గ్రామంలో పలు వీధుల్లో సిసి రోడ్డు లేనియెడల ప్రజలు తిరగడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నదని సిసి రోడ్డు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారని మేజర్ పంచాయతీ సర్పంచ్ పాల్ దినకర్ తెలిపారు.
తెలిపిన వెంటనే ఎమ్మెల్యే వై బాలనాగరెడ్డి సిసి రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది.ఎలాంటి ఇబ్బంది లేకుండా సిసి రోడ్డు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మేజర్ పంచాయతీ సర్పంచ్ పాల్ దినకర్ మాట్లాడుతూ మంత్రాలయ నియోజకవర్గ ఎమ్మెల్యే వై బాలనాగరెడ్డి మా గ్రామానికి ఎలాంటి సమస్యలు ఉన్న మా గ్రామానికి కోరిన వెంటనే సిసి రోడ్డు మంజూరు చేయడం చాలా సంతోషకరమని అన్నారు. గ్రామ ప్రజలకు ఏ సమయంలోనైనా ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్న మా దృష్టికి తీసుకువస్తే వెంటనే నెరవేస్తామని అన్నారని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సక్కరీ తిక్కయ్య ,వైస్ ఎంపీపీ బుజ్జీ స్వామి,మాజీ ఎంపీటీసీ సౌధ్రి బసవ ,మాజి సర్పంచ్ అవతారం,హై స్కూల్ చైర్మన్ వడ్డే రామన్న, సమ్మద్ ,ఉమాపతి, వార్డ్ మెంబర్ కాశిం, భూపాల్,భాషా,తదితరులు పాల్గొన్నారు.