కౌతాళం (ఆంధ్రన్యూస్)
కౌతాళం మండలం మండల పరిధిలో పొదలకుంట గ్రామంలోని త్రాగు నీరు కొరత ఉండడంతో గ్రామ వైయస్సార్ నాయకులు చంద్రయ్య మరియు లక్ష్మయ్య స్థానిక ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో ఎమ్మెల్యే వెంటనే స్పందించి 2 బోర్లను వేయించడం జరిగింది. వేసిన 2బోర్లలో పుష్కళంగా నీరు ఉండడంతో గ్రామ ప్రజలు మరియు నాయకులు పాలించే రాజు మంచివారైతే నే ప్రకృతి కూడా సహకరించింది అని ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేశారు. అలాగే గ్రామ ప్రజలు ఎమ్మెల్యే తనయుడు యువ నాయకులు వై. ప్రదీప్ రెడ్డి కి కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేసి ఎమ్మెల్యే కు రుణపడి ఉంటామని ధీమా వ్యక్త పరిచారు. అలాగే గ్రామంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయని వాటిని కూడా సత్వరమే పరిష్కరించాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమం లో గ్రామ యువత, నాయకులు మహంతేష్, కురబ మల్లయ్య, చంద్రయ్య, లక్ష్మయ్య, సోమనాథ్ తదితరులు పాల్గొన్నారు.