
(ఆంధ్రన్యూస్ కర్నూలు)
కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం లో ఉన్న పుణ్యక్షేత్రం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు విచ్చేసిన బిజెపి కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు,ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రి మరియు పునరుత్పాదన ఇంధన మంత్రి
ప్రహ్లాద్ జోషిని మంత్రాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన
బిజెపి కర్నూల్ జిల్లా అధ్యక్షులు అక్కమ్మ తోట రామకృష్ణ..
ఈరోజు మంత్రాలయం నియోజకవర్గ కేంద్రంలో రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చిన బిజెపి కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు,ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రి మరియు పునరుత్పాదన ఇంధన మంత్రి ప్రహ్లాద్ జోషిని పద్మనాభ తీర్థ గెస్ట్ హౌస్ నందు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి రాఘవేంద్ర స్వామి ఫోటో ను మరియు శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి కౌతాళం మండల అధ్యక్షులు వెంకన్న మరియు విజయ్,లింగన్న,రాజు,దుర్గయ్య తదితరులు పాల్గొనడం జరిగింది.



