
పివిటీజీ కూవీ కుటుంబాల ఆత్మీయతతో పోరు బిడ్డ మర్రి కామయ్య 64వ వర్ధంతి.
మెట్టజ్యోతి: అరకు వ్యాలీ మండలంలోని
ముఖ్యఅతిథిగా హాజరైన అరకు ఎమ్మెల్యే.
శ్రీ చెట్టి ఫాల్గుణ మర్రి కామయ్య వర్ధంతి సందర్భంగా అరకు మెయిన్ రోడ్డు తహసిల్దార్ వారి కార్యాలయం నుండి వెయ్యి మంది (పివిటీజీ) కూవీ సోదర సోదరీలతో కలిసి జోహార్ మర్రి కామయ్య నినాదంతో అరకు ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలోని మర్రి కామయ్య విగ్రహము వరకు ర్యాలీగా వెళ్లి వారందరితో కలిసి మర్రి కామయ్య గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అరకు, ఎమ్మెల్యే.చెట్టి ఫాల్గుణ అనంతరం పద్మాపురం (వీ రిసార్ట్స్) లోని మర్రి కామయ్య వర్ధంతి వేడుక కార్యక్రమం.అరకు వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్.కిల్లో రాజా రమేష్ బోస్ డుంబ్రిగుడ మండల వైసిపి నాయకుడు.శ్రీ చిక్కుడు మల్లేష్
ముంచింగిపుట్టు మండల వైసిపి నాయకుడు.
శ్రీ వంతాల కొండల రావు గారు మరియు తదితర (పీవీటీజీ) కూవీ పెద్దలు తదితరులు కలిసి ఏర్పాటు చేసిన నేటి సంస్మరణ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన అరకు ఎమ్మెల్యే శ్చెట్టి ఫాల్గుణ .మర్రి కామయ్య 64 వ సంస్మరణ సభను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ: భారత స్వాతంత్ర్య సమరంలో నిప్పురవ్వలై ఎగిసిపడుతున్న పోరుబాటలో నేలకొరిగిన ఎందరో ఆదివాసి అగ్ని కెరటాలు ఉన్నారు. ఆ వీర చరిత్రలో విస్మరించబడిన గిరిజన వీరయోధులెందరో భారత స్వతంత్రానంతరం కూడా పోరాటాలు కొనసాగించిన చరిత్రలో ముఖ్యుడు మన ఆదివాసి గిరిజన పోరు బిడ్డ మర్రి కామయ్య ఆనాడు విశాఖ మన్యములో సాగిన (తెల్ల దొరల) దాడిలో అమరుడైన అల్లూరి సీతారామరాజు(1924) తర్వాత రెండవ మన్యం వీరుడుగా ప్రసిద్ధికెక్కింది మర్రి కామయ్యే వీరి పోరాటం చిరస్థాయిగా నిలిచిపోతుంది కొండ తెగకు చెందిన మర్రి కామయ్య అప్పటి విశాఖపట్నం జిల్లా పాడేరు డివిజన్ హుకుంపేట మండలం గరుడపల్లి గ్రామంలో ఆదివాసి గిరిజన (పివిటిజి) కోదు కుటుంబంలో జన్మించిన మర్రి కామయ్య.
మర్రి కామయ్య మోతుబారి రైతు స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో కొనసాగిన ఉద్యమములే మర్రి కామయ్యను మన్యం ప్రాంత ఉద్యమకారుడిగా మార్చాయి.
ప్రభుత్వ ముసుగులో వుంటూ ముఠాదారులు చేస్తున్న పశావిక మైన చర్యలను సహించలేని గిరిజన ప్రజలు కామయ్య నాయకత్వంలో మద్దతుదారులుగా (తోడుగా) చేరి ఆ యొక్క పోరాటములో తోడ్పాటును అందించారు.
ఎన్ని కుయుక్తులు పన్నినను మర్రి కామయ్య అరెస్ట్ కాకపోవడం ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం పూర్తిగా జీర్ణించు కోలేకపోయింది. అందుకు
అటవీ అధికారులు పోలీసులు అధికారులు ముఠాదారులు అందరూ కలిసి 1940లో మర్రి కామయ్యను బంధించి జైలు పాలు చేశారు విడుదల అనంతరం గిరిజన ప్రజల సామాజిక వెనుకబాటులను చూసి తప్పనిసరిగా మళ్లీ మర్రి కామయ్య ఉద్యమించవలసి వచ్చింది. నాటి తెల్ల దొరల నుంచి పెత్తందారుల వరకు అటవీ సంపదనను కొల్లగొట్టడాన్ని జమిందరీ వ్యవస్థను వ్యతిరేకిస్తూ అడవి పై అధికారం గిరిజనులకు చెందాలని మళ్ళీ ఉద్యమించినా మన్యం యోధుడు మర్రి కామయ్య 1959 మే 5వ తేదీ ఈనాటిదినము నాడు నేలకొరిగాడు._
ప్రతి ఏట మర్రి కామయ్య వర్ధంతిని జాతరగా జరుపుకోవడం ఆదివాసి గిరిజన వారసత్వ హక్కుల యొక్క సంఘీభావానికి సాంకేతం అని అరకు నియోజకవర్గం శాసనసభ్యులు.
_చెట్టి ఫాల్గుణ ఉద్ఘటించారు_
(పీవీటీజీ) కూవీ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటూ పీవీటీజీ సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తానని ఎమ్మెల్యే అన్నారు.
ఈ కార్యక్రమానికి తరలివచ్చిన వెయ్యిమంది (పీవీటీజీ) కూవీ ప్రజానికం వర్ధంతి వేడుకకు విచ్చేసిన (పీవీటీజీ) కూవీ పెద్దలు కొందరికి దుస్సాలువతో సన్మానించిన అరకు ఎమ్మెల్యే.
శ్రీ చెట్టి ఫాల్గుణ (గిరిజన బిడ్డ)
మర్రి కామయ్య వర్ధంతి శుభ సందర్భంగా (పీవీటీజీ) కూవీ 156 కుటుంబాలు ఈరోజు అరకు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యములో వైసిపి పార్టీలోకి చేరారు వారందరికీ వైసిపి పార్టీ కండువాలు వేసి సాదరవంగ వైసీపీ పార్టీలోకి ఆహ్వానించిన గౌరవనీయ అరకు ఎమ్మెల్యే. ఈ మర్రి కామయ్య వర్ధంతి సంస్మరణ సభా కార్యక్రమంలో (పీవీటీజీ) కూవీ సహోదర సహోదరీమణులు అనేకమంది పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆరు మండలాల కువి ప్రజలు పాల్గొన్నారు



