Sunday, January 25, 2026
spot_imgspot_imgspot_imgspot_img
Homeతూర్పుగోదావరి జిల్లాపిర్యాదుదారుల పై దురుసుగా ప్రవర్తించిన అనపర్తి విద్యుత్ శాఖ ఏ.డి

పిర్యాదుదారుల పై దురుసుగా ప్రవర్తించిన అనపర్తి విద్యుత్ శాఖ ఏ.డి

పిర్యాదుదారుల పై దురుసుగా ప్రవర్తించిన అనపర్తి విద్యుత్ శాఖ ఏ.డి

బిక్కవోలు, ఆంధ్రన్యూస్ : తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామం లోని ఎప్పటి నుండో పరిష్కారం కాని ఒక పిర్యాదు పై పిర్యాదుదారు సిఎం కి పిర్యాదు చేయగా పరిష్కారం కోసం వచ్చిన అనపర్తి ఏ డి ఈ నిరంజన్ బాబు పిర్యాదుదారులపై సీరియస్ అయ్యి పిర్యాదు ఎవరు చేశారు? ఈ ఇల్లు వారి పేరున వుందా? మీటర్ చెక్ చెయ్యండి ముందు? ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు పిర్యాదు చెయ్యడమే అంటూ తన సిబ్బంది కి ఆదేశాలు ఇచ్చారు. దానితో విబేదించిన పిర్యాదుదారు ముందు సమస్య కు పరిష్కారం చూపమని తరువాత చెకింగ్ చేసుకోమని చెప్పగా ఆయన సీరియస్ అయ్యి సిబ్బంది ని వీరి కలెక్షన్ లు తీసేయ్యమని ఆర్డర్ జారిచేసారు. దానితో తిరగబడ్డ పిర్యాదుదారు లోపలికి రావడానికి కుదరదు అనగా ఆయన సిబ్బంది చే విద్యుత్ సప్లై ఆపించి నిచ్చెన తెప్పించి కరెంట్ కలెక్షన్ తీసి వెయ్యమని ఆదేశాలు ఇచ్చారు. పిర్యాదు దారు ను బెదిరించి చులకన గా మాట్లాడి అవమానం చెయ్యడం దేనికి నిదర్శనం? ముఖ్య మంత్రి కి పిర్యాదు చేస్తే అధికారులు ఇలాగే స్పందిస్తారా అంటూ స్థానికులు విస్తుపోయారు. ఇంటి మీదకు వచ్చే విద్యుత్ వైర్లు తప్పించమని కోరగా, దానికి అభ్యంతరం ఉందని మార్చడం కుదరదని చెప్పిన ఏ డి ఈ అభ్యంతరం చెప్పిన అసామి స్తంభం మార్పు కు అంగీకరించి దానిని అతని వాస్తుకు అనుకూలంగా పిర్యాదుదారు కి ఈశాన్యం లో వేసేలా చెప్పడం జరిగింది. దానికి పిర్యాదుదారు అభ్యంతరం చెప్పడం తో అతని స్థలం లో అతను మార్పు చేసుకొంటుంటే మీకు ఎందుకు అంటూ ఏ డి ఈ అడ్డగోలు గా వాదించినా ,పిర్యాదుదారు వినక పోవడం తో ఏ డి ఈ తన సిబ్బంది తో వీళ్ళు కట్టిన డబ్బులు ఇచ్చెయ్యండి అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయారు.పరిష్కారం కాని సమస్య గా వైర్లు మిగిలిపోయాయి. సమస్య మాట ఎలా వున్నా అధికారి పిర్యాదు దారుల పరిస్థితి తెలుసుకోకుండా ఆవేశపడతావేంటి అంటూ సీరియస్ అవ్వడం, అందరి ముందు విద్యుత్ కనెక్సన్ తొలగించమనడం దేనికి సంకేతం. ఏ విధమైన నోటిస్ ఇవ్వకుండా ఇంట్లోకి చొరబడి సక్రమంగా బిల్లులు కడుతున్న మీటర్ ఎలా పట్టుకు పోతారు?
ఒక బాధ్యత కలిగిన అధికారి, మీరు ముఖ్యమంత్రి కి పిర్యాదు చెయ్యడం ఏంటీ అని దారుణం గా మాట్లాడి, విద్యుత్ సరఫరా తీసేయ్యమని ఆదేశించడం పై పిర్యాదుదారు, ఏ. డి .ఈ పై అధికారులకు పిర్యాదు చేస్తున్నట్లు పత్రికా సమావేశం లో తెలిపారు. పిర్యాదుదారు తిరగబడడం తో విద్యుత్ అధికారులు సప్లై తియ్యకుండ వెనుదిరిగి వెళ్ళిపోయారు. అనపర్తి విద్యుత్ ఏ. డి.ఈ నిరంజన్ బాబు ప్రవర్తననకు స్థానికులు విస్తుపోయారు. ఇటువంటి అధికారుల విధానం వలనే ప్రభుత్వం నకు చెడ్డ తెప్పిస్తుంది అని స్థానికులు అంటున్నారు.ఈ పత్రికా సమావేశం లో బిక్కవోలు మీడియా వెల్పేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కర్రి రామ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ అసలు విద్యుత్ ఏ డి ఈ కి విద్యుత్ సప్లై తీసే అధికారం ఎప్పుడు ఉంటుంది. సక్రమంగా విద్యుత్ బిల్లులు చెల్లించే వారి విద్యుత్ సప్లై తియ్యాలి అంటే తగిన నోటీసులు ఇవ్వాలి కదా? పిర్యాదు విచారణ కు వచ్చిన అధికారి పిర్యాదు దారులు భయబ్రాంతులు అయ్యేలా దారుణంగా మాట్లాడొచ్చా? పబ్లిక్ లో అందరి ముందు ఒక పరువు గల కుటుంబం ను హేళన గా మాట్లాడే అధికారం ఆ అధికారి కి ఎవరు ఇచ్చారు? జగనన్న కు చెబుదాం కు పిర్యాదు చేస్తే ఈ అధికారికి ఇబ్బంది ఏమిటీ? అన్నారు. ఈ విషయం పై న్యాయం కోరుతూ తమ పరువు కు భంగం కలుగజేసి తన సిబ్బంది తో తమ పై దాడికి ప్రయత్నం చేసిన అధికారి పై చర్యలు కోరుతూ పిర్యాదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments