Sunday, January 25, 2026
spot_imgspot_imgspot_imgspot_img
Homeతూర్పుగోదావరి జిల్లాపవన్ కళ్యాణ్ కు ఒక్క అవకాశం ఇవ్వండి.. మర్రెడ్డి శ్రీనివాస్

పవన్ కళ్యాణ్ కు ఒక్క అవకాశం ఇవ్వండి.. మర్రెడ్డి శ్రీనివాస్

పవన్ కళ్యాణ్ కు ఒక్క అవకాశం ఇవ్వండి.. మర్రెడ్డి శ్రీనివాస్

బిక్కవోలు ఆంధ్ర న్యూస్ బ్యూరో ప్రసాద్ పలివెల : తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం వూల్లపల్లి గ్రామంలో ఆదివారం బిక్కవోలు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు ఇందల వీరబాబు ఆధ్వర్యంలో ” ఇంటింటికి జనసేన” కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి అనపర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలిసి జనసేన పార్టీ సిద్ధాంతాలను ఇప్పుడు వరకు జనసేన పార్టీ చేసిన సేవలను ప్రజలకు వివరించి పవన్ కళ్యాణ్ కు ఒక్క అవకాశం ఇమ్మని కోరడం జరుగుతుందని ఆయన తెలిపారు రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా జనసేన వైపే చూస్తున్నారని అధికారంలో లేనప్పటికీ అనేక సేవలు చేసిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే ఇంకా అనేక సేవలు చేస్తారని అదే విషయాన్ని ఇంటింటికి చేరే విధంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు తిరిగి ప్రజలకు తెలియజేస్తామని ఆయన అన్నారు అనంతరం మండల కన్వీనర్ వీరబాబు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినాయకుడు వైపే రాష్ట్ర మొత్తం చూస్తుందని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అంటే ప్రతి జన సైనికుడు ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ చేస్తున్న సేవలను ప్రజలకు తెలియజేయాలని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా జనసైనికులు వీర మహిళలు పనిచేయాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన అనపర్తి నియోజకవర్గం నాయకులు రవ్వాడ నాగు, పెదపూడి జనసేన అధ్యక్షులు నాగిరెడ్డి వీరస్వామి, అనపర్తి జనసేన అధ్యక్షులు నల్లమిల్లి ప్రసాద్ రెడ్డి, రంగంపేట జనసేన అధ్యక్షులు గిరిజాల సత్తిబాబు, చందర్రావు, చంటి, మద్దూరి వీరబాబు తదితర జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments