Sunday, January 25, 2026
spot_imgspot_imgspot_imgspot_img
Homeకర్నూలు జిల్లాపట్టణ సీఐపై చర్యలు తీసుకోవాలి డి.ఎస్.పి కి హిందూ సంఘాలు హిందువుల వినతి

పట్టణ సీఐపై చర్యలు తీసుకోవాలి డి.ఎస్.పి కి హిందూ సంఘాలు హిందువుల వినతి

పట్టణ సీఐపై చర్యలు తీసుకోవాలి డి.ఎస్.పి కి హిందూ సంఘాలు హిందువుల వినతి

ఆంధ్రన్యూస్:ఎమ్మిగనూరు:
వినాయక నిమజ్జనంలో సీఐ దౌర్జన్యం పై నిరసన
ఎమ్మిగనూరు పట్టణంలో గత నెల 31వ తారీఖు న జరిగిన నిమజ్జన కార్యక్రమంలో ఎమ్మిగనూరు పట్టణ సీఐ శ్రీనివాసులు వినాయక నిర్వాహకుల పై బూటు కాళ్లతో తన్ని దౌర్జన్యం చేయడం అతి హేయమైన చర్యని సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఈరోజు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో వివిధ హిందూ సంఘాలు నిరసన తెలుపుతూ దాదాపు రెండు వందల మంది హిందూ కార్యకర్తలు సోమప్ప సర్కిల్ నుండి డిఎస్పి ఆఫీస్ వెళ్లి డి.ఎస్.పి భార్గవి కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. డిఎస్పి భార్గవి స్పందించి సీఐ పై చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది.హిందూ సంఘాలు ఐక్యతతో క్రమశిక్షణతో మెలగాలని నిర్ణయించుకున్నారు.ఈకార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ఆదోని జిల్లా ప్రచార ప్రసార ప్రముఖ్ కసిరెడ్డి ఉపేందర్ రెడ్డి, జిల్లా సహకార దర్శి బి.ఎన్ శ్రీరంగ,జిల్లా గోరక్ష ప్రముఖ జి శ్రీరాములు యాదవ్,ఎమ్మిగనూర్ అడ్వకేట్ శ్రీనివాసులు, మంత్రాలయం ప్రఖండ కార్యదర్శి బి జగదీష్, నందవరం ఖండా కార్యదర్శి జిoకల రవికుమార్,గోవర్ధన్ నాయుడు,గవ్వల నారాయణ,నరహరి,పద్మావతి,పెద్దకడబూర్ బజరంగ్ దళ్ రామాంజనేయులు,శివ శివకుమార్, గోనెగండ్ల వీరేష్ నాయుడు,టి సి మునిస్వామి, తదితర హిందువులు, హిందూ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments