పంచాయతీ సర్పంచ్ చింతపల్లి శ్రీనివాసరావు చేతుల మీదుగా పెళ్లి సర్టిఫికెట్ వధూవరులకు అందజేత
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం నదురబాధ గ్రామములో సర్పంచ్ చింతపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బొమ్మతుల రవీంద్రబాబు,మోకా రజిని ల వైయస్సార్ కళ్యాణమస్తు షాదీ తోఫా కార్యక్రమం లో భాగంగా నదురబాధ సచివాలయంలో ఏపీ సేవా పోర్టల్ నందు మొదటి మ్యారేజ్ సర్టిఫికెట్ ఇష్యూ చేయడం జరిగింది అని సర్పంచ్ చింతపల్లి అన్నారు. నేరుగా మ్యారేజి జరిగిన సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ అప్లికేషన్ ప్రతిని అప్లై చేయగానే ఎటువంటి ప్రయాస పడకుండా గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆ సర్టిఫికెట్ ని ఇష్యూ చేయడం జరిగింది అన్నారు . పెండ్లి కొడుకు బొమ్మతుల రవీంద్రబాబు, పెండ్లి కుమార్తె మోకా రజిని లకు సర్పంచ్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మందపల్లి భాస్కరరావు, డిజిటల్ అసిస్టెంట్ మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.