
(ఆంధ్రన్యూస్ కర్నూలు)
కోసిగి లో జరిగే శ్రీ రేణుక ఎల్లమ్మ రథోత్సవ జాతర వేడుకలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్ని రకాల చర్యలను తీసుకోవడమైనది.సుమారు 150 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడమైనది. దొంగతనాలు జరగకుండా అరికట్టడానికి కోసిగి గ్రామం మొత్తం సీసీ కెమెరాలు నిఘా కూడా ఏర్పాటు చేయడమైనది.అదే విధంగా డ్రోన్ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించడమైనది.ఈ సీసీ కెమెరాలు పరిశీలించుట కొరకు సర్కిల్ ఆఫీస్ నందు ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడమైనది.దొంగలను గుర్తించే నిమిత్తం సుమారు 30 మంది ప్రత్యేక క్రైమ్ పోలీసులను ఏర్పాటు చేయడమైనది.దేవాలయం ఆవరణలో ఈసారి ప్రత్యేకంగా భక్తుల సౌకర్యార్థం ఒక పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు చేయడమైనది.కాబట్టి జాతరకు వచ్చినవారు ఎలాంటి అవాంఛనీయ చర్యలకు పాల్పడకుండా ఉండాలి. సమన్వయం పాటించాలి.అలాగే భక్తులకు ట్రాఫిక్ జాం వలన ఇబ్బంది పడకుండా ఉండే నిమిత్తం ఆదోని వైపు నుంచి వచ్చే వాహనాలు మార్కెట్ యార్డ్ మరియు రైల్వే స్టేషన్ వద్ద,హల్వి,ఉరుకుంద వైపు నుంచి వచ్చే వాహనాలు ఉరుకుంద ద్వారం వద్ద,ఎమ్మిగనూరు వైపు నుండి వచ్చే వాహనాలను రాయల్ స్కూల్ సందు వద్ద ఏర్పాటు చేసినటువంటి పార్కింగ్ స్థలాల్లో వాహనాలు నిలుపుకొని పోలీసువారికి సహకరించి జాతర ప్రశాంతంగా జరిగేలా చేయాలని కోరడమైనది.
(ఆంధ్రన్యూస్ రాయలసీమ జోన్ ప్రతినిధి బి అబ్రహం 9640441653)



