ఏలేశ్వరం. ఈ నెల 21 వ తేదీన జాతీయ నులిపురుగుల నివారణ దినం పురస్కరించుకుని ఒకటి నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ కార్యక్రమం జరుగుతుందని డాక్టర్ బి చంద్ర కిరణ్ బాబు పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 21 నుండి 24వ తేదీ వరకు నిరంతరం జరిగే ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు అంగన్వాడీ కార్యకర్తలు పాఠశాలలలోను, కాలేజీలలో అంగన్వాడి కేంద్రాల్లో ఈ మాత్రలను స్వయంగా మింగించడం జరుగుతుంది అన్నారు. ఆరోగ్య విస్తరణ అధికారి కె భాస్కరరావు మాట్లాడుతూ మండలంలోని 16807 మంది అర్హులైన విద్యార్థినీ విద్యార్థులు ఆల్బెండజోల్ 400 మాత్రలు మింగించడం జరుగుతుంది అన్నారు. దీనివలన పిల్లల్లో రక్తహీనత తగ్గి చురుకుగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు ఎస్ వి రమణ, అప్పలకొండ, ఏసుబాబు, శివరత్నం, ఏఎన్ఎంలు హెచ్ఏలు ఎంఎల్ హెచ్పి లు పాల్గొన్నారు.