
(ఆంధ్రన్యూస్ కర్నూలు)
కర్నూలు జిల్లా కేంద్రంలోని రాయలసీమ విశ్వవిద్యాలయం,కర్నూలు గవర్నమెంట్ కళాశాల ఫర్ మెన్,సిల్వర్ జూబ్లీ కళాశాల,కర్నూలు ప్రభుత్వ జూనియర్ కళాశాల టౌన్ నీట్ పరీక్ష కేంద్రాలను కర్నూలు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా ఆదివారం పరిశీలించారు.ఈ సంధర్బంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా మాట్లాడుతూ కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా,జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ వారి ఆదేశాల మేరకు నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు.కర్నూలు జిల్లా కేంద్రంలోని 16 పరీక్షా కేంద్రాల వద్ద నీట్ పరీక్ష కు 200 పైగా పోలీసులను బందోబస్తు విధులకు కేటాయించామన్నారు.పరీక్షను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించే విధంగా పోలీసులు పకడ్బందీ తనిఖీలు నిర్వహించి అభ్యర్దులను లోపలికి అనుమతించామన్నారు.ప్రతి కేంద్రానికి ఒక సిఐ లేదా ఎస్ఐ స్థాయి పోలీసు అధికారిని నియమించడం జరిగిందన్నారు.ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ సిబ్బందిని పకడ్బందీ ఏర్పాట్లు చేశామని వారు తెలియజేశారు.ఈ సమయంలో
అడిషనల్ ఎస్పీ తో పాటు కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్,సిఐలు ఉన్నారు.



