
ఆంధ్రన్యూస్ : ఏలేశ్వరం. ప్రత్తిపాడు నియోజకవర్గ టిడిపి, జనసేన,బిజెపి కూటమి ఉమ్మడి అభ్యర్థి వరుపుల స4283త్యప్రభ నిత్యం ప్రచారంలో అలుపెరగకుండా, అందర్నీ కలుపుకుంటూ దూసుకుపోతున్నారు. ఆదివారంనాడు మండలంలోని జె అన్నవరం గ్రామంలో ప్రచారంనిర్వహించారు. గ్రామానికి చెందిన 30 కుటుంబాల వారు వైసీపీ నుండి టిడిపిలో చేరారు. ప్రజలు సత్యప్రభ కు స్వాగతం పలకడానికి పోటీ పడుతూ,బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడు పార్టీలకు చెందిన కార్యకర్తలతో ఎన్నికల కమిటీ నిర్మిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో గొల్లపల్లి బుజ్జి, బొరుసు శ్రీనివాస చక్రవర్తి, ఉమ్మిడి వెంకట్రావు, జ్యోతుల పెదబాబు, వారి సంఖ్యలో టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.



