
(కర్నూలు ఆంధ్రన్యూస్)నాల్గవ రాష్ట్రస్థాయి లాక్రోస్ పోటీలకు వైద్య సేవలు అందించిన డాక్టర్. స్. వి చంద్ర శేఖర్ (సీఈఓ) జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ వారికి ప్రశంసా పురస్కారం అవార్డు ను కర్నూల్ డిస్ట్రిక్ట్ లాక్రోస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్. హరికిషన్, జనరల్ సెక్రెటరీ ఎన్.వజ్ర రాజు, శోభన్ బాబు ప్రెసిడెంట్ మానవతా, వెంకటరాజు పారా అసోసియేషన్ ప్రెసిడెంట్, శ్రీనివాసులు మాజీ సైనిక సంఘము నాయకులు వారు అందించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ ఎస్.వి చంద్రశేఖర్ మాట్లాడుతూ అక్టోబర్ 4,5 తేదీలలో జరగబోయే సౌత్ జోన్ జాతీయస్థాయి లాక్రోస్ పోటీలకు కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని మరియు క్రీడాకారులకు వైద్య సేవలు అందించడానికి జెoమ్ కేర్ కామినేని హాస్పిటల్ వారు ఎల్లవేళలా సేవలు అందిస్తారని తెలియజేశారు.



