
ఎమ్మిగనూరు:ఆంధ్ర న్యూస్: ఎమ్మిగనూరు ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీసులు ఈరోజు జరిపిన దాడులలో మంత్రాలయం మండలం మాధవరం తాండ శివార్లలో నాటు సారా కాస్తున్నారు అనే విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు జరపగా నాటు సారా తయారు చేయడానికి సిద్ధంగా ఉన్న 190 లీటర్ల బెల్లం ఊటను, బట్టీలను ధ్వంసం చేసి కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో తదుపరి విచారణలో ఈ బట్టీలకు సంబంధించినటువంటి సొంతదారులు ఎవరో విచారించి వారిని కేసుల్లో చేర్చడం జరుగుతుంది అని సి ఐ రమేష్ రెడ్డి అన్నారు. ఈ మొత్తం 190 లీటర్ల బెల్లం వూట విలువ సుమారుగా 40 వేల రూపాయలు ఉంటుంది అని అన్నారు.ఈ దాడుల్లో ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ రమేష్ రెడ్డి ఎస్సై ఇస్మాయిల్ హెడ్ కానిస్టేబుల్ గోపాల్ కానిస్టేబుల్లు సూర్య ప్రకాష్,నాగార్జున రెడ్డి, సుధాకర్ లు పాల్గొన్నారు.



