Wednesday, January 21, 2026
spot_imgspot_imgspot_imgspot_img
Homeకొనసీమ జిల్లానదురబాధ గ్రామంలో ఘనముగా జరిగిన ముత్యాలమ్మ జాతర మహోత్సవం.

నదురబాధ గ్రామంలో ఘనముగా జరిగిన ముత్యాలమ్మ జాతర మహోత్సవం.

నదురబాధ గ్రామంలో ఘనముగా జరిగిన ముత్యాలమ్మ జాతర మహోత్సవం.

రాయవరం, మెట్టజ్యోతి బ్యూరో ప్రసాద్ పలివెల : డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం నదురబాధ గ్రామంలో శ్రీ. శ్రీ.శ్రీ. ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ చింతపల్లి శ్రీనివాసరావు కుటుంబసమేతంగా హాసరవ్వి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఈ జాతరలో గ్రామంలోని భక్తులందరూ కులమతాలకు సంబంధం లేకుండా పాల్గొన్నారు, అధిక సంఖ్యలో చుట్టు ప్రక్కల ఉన్న గ్రామ ప్రజలు ప్రతిఒక్కరూ జాతర చూడటానికి వచ్చారు కనులు మిరమిట్లు గొలుపే బాణాసంచాతో, దేవాలయం చుట్టూ విద్యుత్ దీపాలంకరణతో అందంగా అలంకరించి నారు. సర్పంచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ నదురబాధ గ్రామంలో వేంచేసియున్న ముత్యాలమ్మ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి పూర్వకాలపు ఆచారం ప్రకారం నేటికీ మా గ్రామస్తులందరం కూడా కులాలకు అతీతంగా ఏకమై ఈ జాతరను ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంటాం అన్నారు ఈ జాతర ప్రత్యేకత ముఖ్యంగా నదురబాధ గ్రామ ప్రజలు ఎక్కడ ఉన్నా
జాతరకు తప్పనిసరిగా హాజరవుతారు అన్నారు.
జాతరలో అమ్మవారికి భక్తులు నైవేద్యాలు అత్యంత భక్తిశ్రద్ధలతో సమర్పించినారు కార్యక్రమంలో ఈరోజు అమ్మవారు జాతర మహోత్సవం రేపు అనగా 11-04-2023 అమ్మవారు తీర్ధమహోత్సవంలలో గ్రామసర్పంచ్ శ్రీనివాసరావు దంపతులు ఆలయ కమిటీ అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments