
ఆంధ్రన్యూస్ : ఒంగోలు. ఎందరో ధీరులు దాస్య శృంఖలాలను తుంచి భారతదేశానికి స్వాతంత్రం సిద్ధింపచేసినా… భారతీయులలో అఖండ భారత సాధన కోసం చేయాల్సిన ఉత్సాహాన్ని ప్రేరణను కల్పించడానికి, యువతలో విషయ వాంఛలను, వ్యసన ధోరణులను దూరం చేయడానికి, దేశభక్తిని దైవభక్తిని దేశ రక్షణలో భాగస్వాములను చేయడానికి, మాతృభూమి సాధనలో అమరులైన అమరవీరుల కు నిజమైన నివాళి అందించేలా… దేశ భద్రతలో… సంస్కృతి సనాతన ధర్మాలను బలోపేతం చేయడం కొరకు కాలినడకన ఇప్పటి వరకు 14వేల 500 కిలోమీటర్లు పైగా దేశ పర్యటన చేస్తున్న స్వయంసేవక్ వైష్ణోదాస్ శివకరణ్ గౌరవనీయులని వారి స్ఫూర్తితో మన యువత దేశం కోసం ధర్మం కోసం అఖండ భారత సాధనలో భాగస్వాములు కావాలని విశ్వహిందూ పరిషత్ ప్రాంత సత్సంగ ప్రముఖ సోమ సుబ్బారావు పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఫతేపూర్ జిల్లా నివాసి చంద్రబాన్సింగ్ కుమారుడైన వైష్ణోదాస్ శివ కిరణ్ తమ దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఒంగోలు నగరం చేరుకోవడం జరిగినది. 16వ తేదీ ఆదివారం ఒంగోలు నగరంలో జరిగిన హనుమాన్ శోభాయాత్రలో వారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఒంగోలు జిల్లాకు వచ్చిన నేపథ్యంలో మంగళవారం విశ్వహిందూ పరిషత్ కార్యాలయం లో జరిగిన సత్సంగ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా మరియు నగర కార్యకర్తలు వారిని సత్కరించారు.
వారిని పరిచయం చేస్తూ 35 సంవత్సరాల శివకరణ్… చిరుప్రాయంలో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తగా 20 సంవత్సరాల వయసులోనే 2009వ సం.లో తొలిసారి 3 సంవత్సరాల 6 నెలలపాటు భారతదేశ యాత్ర చేశారని, 2022వ సంవత్సరంలో రెండవసారి భారత దేశ యాత్ర ఫతేపూర్ నుండి జమ్మూ కాశ్మీర్ అక్కడ నుండి కన్యాకుమారి వరకు భారతదేశ త్రివర్ణ పతాకను చేపట్టి పాదయాత్ర కొనసాగిస్తున్నారని తెలిపారు. వారి దినచర్యలో భాగంగా ప్రతిరోజు భారత మాత పూజ చేయడం, స్థానికంగా ఉన్న హైందవ కార్యాలయాలు, దేవాలయాల వద్ద అమరవీరులకు జ్ఞాపికగా మొక్కలు నాటడం, స్థానిక యువతతో సమావేశాలు ఏర్పాటు చేసి దేశభక్తిని, అమరవీరుల గురించి వారికి బోధించడం చేస్తున్నారు. పాదయాత్రలో భాగంగా ప్రతిరోజు 20 కిలోమీటర్లు ప్రయాణిస్తూ… తమ భారత దేశ యాత్రను కొనసాగిస్తున్నారు. వారు మీడియాకు ఇచ్చిన సందేశంలో దేశ రక్షణలో యువత ముందుండాలని, మత్తు పదార్థాల వాడకం తద్వారా కుటుంబము దేశము ఆర్థికంగా పతనమైపోతుంది దాని నుండి ఎవరికివారు తమను రక్షించుకోవాలని, అఖండ భారత సాధనలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పరిషత్ బాధ్యులు శివ కరణ్ ను సన్మానించారు.కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ప్రాంత సత్సంగ ప్రముఖ్ సోమ సుబ్బారావు, మఠమందిర్ ప్రముఖ్ శివశంకర్, జిల్లా కార్యదర్శి యనమనమెల్లూరి సీతారామయ్య, నగర అధ్యక్షులు పసుమర్తి వెంకటేశ్వర్లు, మరియు ప్రచార ప్రముఖ్ రాధా రమణ గుప్తా జంధ్యం, బజరంగ్ ప్రముఖ్ గడ్డం శ్రీనివాసులు, భైరవేశ్వరానంద స్వామి, సాధు శ్రీనివాస్ గుప్తా, సుంకు రఘు, రంగారావు మరియు మాతృమూర్తులు, తదితరులు పాల్గొన్నారు.



