
(కర్నూలు ఆంధ్రన్యూస్) కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం కౌతాళం మండల కేంద్రంలో దళితులందరూ కలిసి మొన్న జరిగిన గుంటూరు జిల్లా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిలీ సింగయ్య ఎస్సీ మాదిగ కుల వ్యక్తిని కించపరిచే విధంగా అసభ్యకరంగా వ్యాఖ్యలు వ్యాఖ్యానించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పై ఎస్సీ/ఎస్టీ నిబంధన ప్రకారం ఫిర్యాదు.
గుంటూరు జిల్లా ఏటుకూరు సమీపంలో తేదీ 18/6/2025 లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందినవారు మృతిచెందిన వ్యక్తిపై గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుప్పం నియోజకవర్గంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ చేసిన ఘోరమైన,కుల ప్రతిపాదికన తక్కువ చేసి,ఎస్సీ మాదిగ సామాజిక వర్గం మనోభవాలు దెబ్బ తినే విధంగా వాక్యాలపై ఎస్సీ ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టం,1989 దెబ్బ తినే విధంగా వాక్యాలపై BNS చట్టంలోని అనుకూలమైన సెక్షన్ల ప్రకారం ఈ ఫిర్యాదును దాఖలు చేస్తున్నాను.ఈ కేసు ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణలో ఉంది.ఇటువంటి సున్నితమైన సమయంలో ప్రజా ప్రతినిధులు న్యాయ ప్రక్రియకు భంగం కలిగించకుండా బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది.అయినప్పటికీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు తన ప్రసంగంలో మృతుని గురించి మాట్లాడుతూ కుక్క మాదిరిగా తీసి పక్కన పడేసి వెళ్లిపోయారు అనే పదాలను వాడారు ఈ వాక్యాలు అమానుషమైనది, అవమానకరమైనవి మరియు ఎస్సీ మాదిగ వ్యక్తి గౌరవాన్ని మాత్రమే కాదు, మొత్తం సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయి.ముఖ్యమంత్రి చేసిన వాక్యాలు ఎస్సి వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా అవమానించడంగా,ఎస్సీ ఎస్టీ చట్టం 1989 లోని 3(1)(s)సెక్షన్లకు లోబడే నేరంగా లెక్కించబడుతుంది అలాగే ఈ వాక్యాలు భారత రాజ్యాంగం ఆర్టికల్ 17(అంటరానితనం నిషేధం మరియు సమాన గౌరవ హక్కు) ఉల్లంఘనగా పరిగణించబడతాయి.ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల,కుల పరమైన వైశమ్యాన్ని ప్రోత్సహించడమే కాకుండా ఆ వర్గం మానవ గౌరవాన్ని మనోభావాన్ని హరించడం అవుతుంది.ఎస్సీ ఎస్టీ చట్టం మరియు బిఎన్ఎస్ చట్ట ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి న్యాయ పరమైన తగిన చర్యలు తీసుకొని ఎస్సీ వర్గాల గౌరవాన్ని పరిరక్షించగలరని విజ్ఞప్తి చేస్తున్నాము.ముఖ్యమంత్రి ప్రసంగం వీడియో యొక్క ట్రాన్స్కిప్ట్ చేయించారని ఆవేదన వ్యక్తం చేస్తున్న
వైసిపి ఎస్సి సెల్ జిల్లా ఉపాధ్యక్షులు ఎం అవతారం
వైసిపి ఎస్సి సెల్ మంత్రాలయం నియోజకవర్గం అధ్యక్షులు ఎం జయపాల్ మరియు దళిత నాయకులు పాల్గొన్నారు.



