మెట్టజ్యోతి: జంగారెడ్డిగూడెం. తాడేపల్లిలో ఎస్సీ ఫైనాన్స్ డైరెక్టర్ వద్ద ఈ ప్రభుత్వంలో దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై, సబ్ ప్లాన్ నిధుల దారి మళ్లింపు పై కార్పొరేషన్లో నిర్వీర్యం చేయటంపై రాష్ట్ర ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో రేపు ఉదయం నిర్వహించ తలపెట్టిన నిరసన ర్యాలీకి జిల్లా నుంచి దళితులంతా పెద్ద ఎత్తున తరలి రావాలని ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుమర్తి రామారావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం లోని తన కార్యాలయం నుంచి పత్రికా విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులంతా ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపిస్తే ఏరా గద్దెనెక్కాక ఎస్సీ సప్లై నిధులను దారిమల్లిస్తూ కార్పొరేషన్లను పూర్తిగా నిర్వీర్యం చేసి దళితులపై అత్యధికమైనటువంటి దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అన్యాయాలపై దళితులంతా సమర శంఖం పూరించి బుధవారం నాడు జరగబోయే నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రతి ఒక్క దళిత బిడ్డ తాడేపల్లిలోని ఎస్సీ ఫైనాన్స్ డైరెక్టరేట్ వద్దకు తరలురావాలని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమానికి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెస్ రాజు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అంతా కూడా హాజరవుతున్నారని కావున దళితుల అంతా కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు గొల్లమందల శ్రీనివాస్ అధికార ప్రతినిధి తాళ్లూరు వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి తలారి వీరబాబు తదితరులు పాల్గొన్నారు