కౌతాళం (ఆంధ్రన్యూస్ )
కౌతాళం మండల పరిధిలోని తోవి గ్రామంలో ప్రభుత్వ ఆదేశాలు మేరకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి గ్రామ సభ నిర్వహించాలి. అందులో భాగంగా ఈరోజు ఉదయం 11 గంటలకు తోవి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి యోగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ నరసప్ప ఉప సర్పంచ్ జై రామ్ ఈ గ్రామ సభకు అధ్యక్షత వహించడం జరిగింది. అనంతరం వారి మాట్లాడుతూ మన గ్రామంలో ఇప్పటివరకు చేపట్టిన రోగతి, గ్రామ సమస్యల పరిష్కారం, చేయవలసిన పనులు గురించి తీర్మానం చేసుకోవడం జరుగుతుందని అదేవిధంగా మన గ్రామ సచివాలయంలో ఉండే వివిధ శాఖ అధికారులు చేసేటువంటి పనులు గురించి గ్రామ సభలో వివరించడం జరిగింది. మరియు మన గ్రామానికి ఈ సంవత్సరానికి సంబంధించి పెన్షన్లు, రైతు భరోసా ద్యారా వచ్చిన అర్హులు ఎంతమంది, ఇన్సూరెన్స్, అదేవిధంగా క్రాప్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలి అని ప్రజలకు వివరించడం జరిగింది. గ్రామములో డ్రైనేజ్ సిసి రోడ్డు ఇలాంటి సమస్యలు గ్రామంలో ఉండి ఉంటే సర్పంచ్ పరిష్కరిస్తాం అని అన్నారు. ఇలా ఆయా శాఖలు వారిగా చేసిన సేవలు గురించి ఈ గ్రామసభలు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నరసప్ప, ఉప సర్పంచ్ జైరామ్,పంచాయతీ కార్యదర్శి యోగేశ్వర్ రెడ్డి, వీఆర్వో వన్నూరు స్వామి, వెల్ఫేర్ అసిస్టెంట్ రాజ్ కుమార్, అగ్రికల్చర్ అసిస్టెంట్ బల్దేవ్ నాయక్, గ్రామ సర్వేసంధ్య,గ్రామ నాయకులు రవి, బి ఎస్ నాగప్ప , మరియు గ్రామ వాలంటరీస్, అంగన్వాడి కార్యకర్తలు, గ్రామ ప్రజలు. తదితరులు పాల్గొన్నారు.