మెట్టజ్యోతి కిర్లంపూడి కాకినాడ జిల్లా : మాజీ పార్లమెంటు సభ్యులు మరియు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు అయిన తోట నరసింహం తనయుడు తోట రాంజీ బాబు శనివారం ఉదయం తన స్వగ్రామమైన కిర్లంపూడి మండలం వీరవరం లో ఉన్న శివాలయాన్ని సందర్శించారు. గ్రామానికి చేరుకున్న తమ అభిమాన నాయకుడు తోట నరసింహం తనయుడైన రాంజీ బాబుకీ స్థానిక నాయకులు ఎదురెళ్లి స్వాగతం పలికారు. ముందుగా కార్తీక మాసం పురస్కరించుకొని శివాలయంలో ఏర్పాటుచేసిన సప్తహ భజన కార్యక్రమాలను రాంజీ తిలకించారు. అనంతరం ఆ దేవదేవుడైన పరమేశ్వరుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా రాంజీ మాట్లాడుతూ ఆ పరమేశ్వరుడు దయవల్ల తన తండ్రి ఆరోగ్యం కుదిరిపడిందని ఆనందo వ్యక్తం చేశారు. అలాగే తన తండ్రి సూచనల ప్రకారం ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గోకవరం వస్తున్నందున ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందని రాంజీ వివరించారు. త్వరలోనే తమ అభిమానులతో పాటు నియోజకవర్గ ప్రజలందరినీ పేరుపేరునా వెళ్లి కలవడం జరుగుతుందని రాంజీ అన్నారు. తన తండ్రి ఆరోగ్యం బాగోలేని సమయంలో నియోజకవర్గ ప్రజలు ఆయన ఆరోగ్యం కుదుటపడాలని చేపట్టిన ప్రార్థనల మూలంగా నిండు ఆరోగ్యంతో ఇంటికి చేరుకోవడం చాలా సంతోషాన్నిచ్చిందని రాంజీ పేర్కొన్నారు. తమ కుటుంబానికి అంతటి చల్లని ఆశీస్సులు అందించిన ప్రజలందరి రుణం ఏవిధంగా తీర్చుకోవాలన్న దాని పైనే తరచూ ఆలోచిస్తూ ఉంటామని అన్నారు. ముఖ్యమంత్రి కూడా తన తండ్రి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచడం ఎప్పటికప్పుడు వివరాలను తమ నుండి తెలుసుకోవడం దానికి తోడు తోట నరసింహం కుటుంబం పట్ల ముఖ్యమంత్రికి ఉన్న అభిమానం చూస్తే నరసింహం కడుపున పుట్టిన తనకు చాలా గర్వంగా ఉందని తోట రాంజి బాబు తెలిపారు. రాంజీ వెంట తోట బాబ్జి, తోట వేణుగోపాలరావు, తోట వెంకటాచలం, తోట బాసుమూర్తి, అడపా రాజేష్, తోట అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు
తోటనరసింహం యోగ క్షేమాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.
RELATED ARTICLES