కౌతాళం (ఆంధ్రన్యూస్)
కౌతాళ మండల పరిధిలోని గోతలదొడ్డి గ్రామంలో ఎన్టీఆర్ 27వ వర్ధంతి సందర్భంగా తెలుగు జాతి గుర్తుంచుకునే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చూడి ఉల్లిగయ్య అన్నారు.తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారకరామారావు 27వ వర్ధంతి సంధర్బంగా పార్టీ కార్యకర్తలతో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఈ సందర్భంగా చూడి ఉల్లిగయ్య మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడిన ఏకైక వ్యక్తి నందమూరి తారకరామారావు అని అన్నారు. ఎన్టీఆర్ పేదల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేశారన్నారు. ఆయనలా నటించే వ్యక్తి మరొకరు పుట్టరన్నారు. పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఆయన అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. ఎన్టీఆర్‌ను తలచుకోగానే స్ఫూర్తి వస్తుందన్నారు. ఎన్టీఆర్ పేదల కోసం బతికారని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడారని పేర్కొన్నారు. పేదలకు పక్కా గృహాలు నిర్మించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.రాయలసీమను ఆదుకున్న ఏకైక వ్యక్తి కూడా ఎన్టీయారేనని పేర్కొన్నారు. సమాజమే దేవాలయం,పేదలే దేవుళ్లని ఎన్టీఆర్ పదేపదే చెప్పేవారని,ఆయన స్ఫూర్తితో పనిచేయాలని పార్టీ శ్రేణులకు ఉల్లిగయ్య. మరియు సురేష్ నాయుడు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమములో తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్ నాయుడు మరియు సతీష్ నాయుడు నివాళులు అర్పించారు.అదేవిధంగా ఈ కార్యక్రమములో మండలములోని అన్ని గ్రామ నాయకులు నరసింహా మూర్తి,నీలకంఠ రెడ్డి,ముకన్న,చిన్న ,సిద్దప్ప హల్వి,రామలింగన్న,సత్యరాజు, ఈరన్న,నాగిరెడ్డి,చిన్న,పెద్ద సిద్దయ్య, సత్య రాజ్, సర్పంచ్ లక్కే గోవిందు, రంగస్వామి,మరియు పకిరయ్య,కూరువ నాగేష్,హనుమంతు,యంకోబా,చంద్ర,మారెప్ప,ఈరన్న,వెంకటేష్,గోవిందు,ఏలిష,వీరెస్,నాగరాజు,ఉశేని, బుడదొద్ది,నజీర్,మారెప్ప,నవీన్,నరసింహా,విరేశ్,అంజి,శ్రీరామ్,రామాంజినేయులు,శీను,జకీర్,నరసన్న.ఎన్.టి.ఆర్ విరేష్,నరసప్ప,సారాయి రము, తిమ్మాపురం,చిన్న,పెద్ద సిద్దయ్య,అల్లయ్య,బసవగౌడ్, శ్రీధర్,పూజారి,సన్నప్పా, లక్ష్మయ్యా,సురేష్,అంజి,ఈరన్న, వీరారెడ్డి,మహనంది,హనుమంతరెడ్డి,అంబరేష్, ఆల్లయ్య, భూషాన్గౌడ్,రామన్‌గౌడ్,ముఖేష్,రాము, తిమ్మా,శరణ,మహదేవ, మారుతి, తెలుగు యువత రమంజీనేయులు,కృష్ణ,లింగేష్, రాహిమన్,గొట్టయ్య,సునీల్, అమ్మువాలీ, శ్రీరామ్,నాగరాజు, మైబూ తదితరులు పాలుపంచుకున్నారు.