
తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు అందించిన గొప్ప వ్యక్తి స్వర్గీయ మూలారెడ్డి.
బిక్కవోలు, ఆంధ్రన్యూస్ బ్యూరో : తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బిక్కవోలుగ్రామంలో నల్లమిల్లి మూలారెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే మాగంటి బుచ్చయ్య చౌదరి, తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ముందుగా బిక్కవోలు గ్రామంలో ఏర్పాటు చేసిన నల్లమిల్లి మూలారెడ్డి విగ్రహాన్ని బుచ్చయ్య చౌదరి, రాజప్ప చేతుల మీదగా ఆవిష్కరించారు అనంతరం విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాజప్ప మాట్లాడుతూ మూలారెడ్డి నాకు రాజకీయగురువు అని ఎన్నో విషయాల్లో నాకు సలహాలు ఇచ్చి నన్ను ముందుండి నడిపిన గొప్ప వ్యక్తిని ఆయన అన్నారు ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన మొదలు తన జన్మ ప్రాం తం అభివృద్ధి చెందాలన్నది ఆయన ఉత్తమ ఆశయంగా పనిచేశారని కార్యకర్తను తన గుండెల్లో పెట్టుకుని చూసేవాడని కార్యకర్త కోసం పార్టీ కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి నల్లమిల్లి మూలారెడ్డి అని ఆయన అన్నారు.1983లో అనపర్తి నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా పోటీ చేసి తొలిసారి చట్టసభలో అడుగు పెట్టారని. అనపర్తి శాసనసభ్యునిగా 1989 1999ల్లో జరిగిన ఎన్నికల్లో విజయాలు దక్కించుకున్న వ్యక్తి మూలారెడ్డి అని ఆయన అన్నారు అనంతరం బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ 26 ఏళ్ల వయసులో 1970లో రామవరం గ్రామ ప్రెసిడెంట్ రాజకీయ ఆరంగ్రేటం చేసిన వ్యక్తి మూలారెడ్డి అని అప్పటి పెత్తనం దారులైన కాంగ్రెస్ రాజకీయాలకు చరమగీతం పాడిన యువ కెరటంగా నిలిచారని. రామవరం గ్రామ ప్రెసిడెంట్ గా పదవి చేపట్టిన అనతి కాలంలోనే రాజకీయ ఉద్దండుడిగా పేరొందిన రాయవరం మనసబును ఢీకొట్టి రాయవరం సమితి ఎన్నికల గెలుపులో కీలక భూమికతో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారని అనంతరం తెలుగుదేశం పార్టీ ఆశయాలు నచ్చి తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు అందించిన గొప్ప వ్యక్తి అని ఆయన కొనియాడారు ఆయన లేని లోటును ఆయన కుమారుడు రామకృష్ణారెడ్డి భర్తీ చేశారని రామకృష్ణారెడ్డి కూడా ఇప్పుడున్న ప్రభుత్వంపై వారి మోసాలపై ప్రజలకు తెలిసే విధంగా తిరుగుబాటు చేస్తున్నారని దాని ఫలితంగానే సుమారు 24 కేసులు పెట్టి వేధించడమే కాకుండా జైలుకు కూడా పంపారని అయినా కూడా అలుపెరగని పోరాటం రామకృష్ణారెడ్డి చేస్తున్నారని జగన్ మాటలకు ప్రజలు మోసపోయే కాలం పోయిందని బటన్ నొక్కే పేరుతో ప్రజల్ని జగన్ మోహన్ రెడ్డి వెర్రి వాళ్ళను చేస్తున్నాడని ఆ విషయం ఇప్పుడిప్పుడే ప్రజలకు కూడా అర్థమవుతుందని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం డిగ్రీ మరియు ఇంజనీరింగ్ తదితర విద్యార్థులు సంవత్సరానికి 10 లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తున్నారని వాళ్లు ఉపాధి కోసం పొట్ట పట్టుకుని పక్క రాష్ట్రాలకు వెళ్లి బతకవలసిన పరిస్థితి ఏర్పడిందని అమర్ రాజా లాంటి ఫ్యాక్టరీలు రాష్ట్రం విడిచి వెళ్లిపోయాయని పక్క రాష్ట్రంలోని ముఖ్యమంత్రి అమర్ రాజా కంపెనీకి కావలసిన అన్ని సదుపాయాలు సమకూర్చడంతో పదివేల కోట్ల రూపాయలతో పదివేల మందికి పని కల్పించే భారీ పరిశ్రమను అక్కడ స్థాపించారని ఆంధ్ర ప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అంటూ ఏ ఒక్క పరిశ్రమ లేదని వైజాగ్ లో ఉన్న ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడం చేతకాలేదు గాని కడపలోని ఉక్కు పరిశ్రమ పెడతానంటూ శంకుస్థాపన చేయడం చాలా విడ్డూరంగా ఉందని యువతకు చేపలు అమ్ముకోవడం మాంసం అమ్ముకోవడం లాంటి విక్రయ కేంద్రాలు పెట్టుకోమనడం హాస్యాస్పదంగా ఉందని ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరిచి మన భవిష్యత్తును గుర్తించకపోతే ఆంధ్ర ప్రదేశ్ ప్రపంచ పటంలో ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రతి తెలుగుదేశం కార్యకర్త ప్రతి ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను తెలియజేసి తెలుగుదేశం పార్టీ గెలుపొందే విధంగా కష్టపడి పని చేయాలని ఆయన తెలిపారు. బుచ్చయ్య చౌదరి మాట్లాడినప్పుడు పలుమార్లు మూలారెడ్డి తనయుడు రామకృష్ణారెడ్డి పలుమార్లు భావుద్వేకానికి లోనయ్యారు.ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ళ గోవింద్,తూర్పుగోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు సిరసపల్లి నాగేశ్వరరావు,తూర్పుగోదావరి జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి,రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి ఆదినారాయణరెడ్డి,అనపర్తి, బిక్కవోలు, పెదపూడి మండలాల పార్టీ అధ్యక్షులు దత్తుడు శ్రీను,వేణుగోపాలరెడ్డి,రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గంగాధర్ చౌదరి,రాష్ట్ర తెలుగు మహిళ అధికార ప్రతినిధి వేణమ్మ,రాష్ట్ర ఎస్సి సెల్ అధికార ప్రతినిధి వరప్రసాద్,రాష్ట్ర ఎస్సి సెల్ కార్యదర్శి సూర్యప్రకాష్,అనపర్తి నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు సూర్యకుమారి, తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి వెంకటరామారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా తెలుగు రైతు కార్యదర్శి సుబ్బారెడ్డి,సొసైటీ మాజీ అధ్యక్షులు సూర్యనారాయణరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా వాణిజ్య విభాగ కార్యదర్శి త్రిమూర్తులు, అనపర్తి నియోజకవర్గ వాణిజ్య విభాగ కార్యదర్శి డాక్టర్ శ్రీను,పెదపూడి మండల పార్టీ తెలుగు మహిళ అధ్యక్షురాలు సత్యవతి,మాజీ ఎంపీటీసీ శ్రీలక్ష్మి,మండల పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షులు జోషిబాబు, తూర్పుగోదావరి జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు శ్రీధర్, తూర్పుగోదావరి జిల్లా తెలుగు యువత కార్యనిర్వహక కార్యదర్శి బాసి,అనపర్తి నియోజకవర్గ తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి బుల్లిదోర,మండల పార్టీ ఎస్సి సెల్ ప్రధాన కార్యదర్శి సిద్దు,మండల & గ్రామ నాయకులు పాల్గోన్నారు.



