తుల్యభాగ రహదారి ప్రక్కన ఉన్న చెత్తను జెసిబి తో శుభ్రం చేయించిన సర్పంచ్ రామకృష్ణ.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం మండల కేంద్రము రాయవరం గ్రామంలో సర్పంచ్ చంద్రమళ్ళ రామకృష్ణ ఆధ్వర్యంలో అద్వానంగా ఉన్న తుల్యభాగ వెళ్లే రహదారి ప్రక్కన ఉన్న చెత్తా చెదారాలను శుభ్రం చేయించడం జరిగింది
ఈ సందర్భంగా సర్పంచ్ విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలో డెంగ్యూ మలేరియా సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న తరుణంలో గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని స్వయంగా తన పర్యవేక్షణలో జెసిబి ఏర్పాటు చేసి ఉన్న చెత్తా చెదారాలను శుభ్రం చేయించడం జరిగింది అన్నారు